ఉరి ప్రాక్టీస్ చేయబోతే.. చివరికి ఊపిరి ఆగింది?
ఈ క్రమంలోనే స్కూల్ దశలో అయితే ఏకంగా స్వాతంత్ర సమరయోధులకు సంబంధించిన వేషధారణలో విద్యార్థులు కనిపిస్తూ ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటారు. ఇక ఇలా స్వాతంత్ర సమరయోధులు లాగానే డ్రెస్సింగ్ చేసుకోవడం లాంటివి చేసి ఎన్నో ప్రైజ్ మనీలు గెలుచుకోవడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. ఇక ప్రతి ఒక్కరికి విద్యార్థి దశలో ఇలాంటి అనుభవాలు ఉండే ఉంటాయి. ఇక్కడ ఒక విద్యార్థి ఇలా స్కూల్లో ఏకంగా ఒక స్వాతంత్ర్య సమరయోధుడు పాత్రలో కనిపించాలని భావించాడు. కానీ అలా తెలిసి తెలియక చేసిన పని చివరికి ప్రాణం తీసేసింది.
ఏకంగా పాఠశాలలో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలలో భగత్ సింగ్ పాత్రను పోషించాలి అనుకున్నాడు విద్యార్థి. ఇందుకోసం ఉరి వేసుకోవడం ప్రాక్టీస్ చేయబోయే చివరికి ఊపిరి కోల్పోయాడు. కర్ణాటకలోని చిత్రదుర్గంలో ఎల్.ఎల్.వి పాఠశాలలో ఈ ఘటన జరిగింది. భగత్ సింగ్ పాత్రను పోషించాలి అనుకున్న సంజయ్ గౌడ అనే 12 ఏళ్ల బాలుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో భగత్ సింగ్ లాగా ఖైదీ దుస్తులు వేసుకొని ఫ్యాన్ కు తాడు కట్టి ఉరిని మెడకు బిగించుకుని ప్రాక్టీస్ చేశాడు. కానీ పొరపాటున కాలుజారి కిందికి పడిపోవడంతో చివరికి విలవిలలాడుతూ ప్రాణాలు కోల్పోయాడు.