"బ్రేక్ అప్" కి నో చెప్పడంతో పక్కా ప్లాన్ తో హత్య చేసిన కి"లేడీ" !

VAMSI
మాములుగా ఈ రోజుల్లో ప్రేమ పెళ్లిళ్లు ఎక్కువ అయ్యాయి. కులం, మతం , ప్రాంతం , వయసు ఇలాంటి తారతమ్యాలు ఏమీ పట్టించుకోకుండా ప్రేమించుకుంటున్నారు. కానీ అతి తక్కువ మంది మాత్రమే ప్రేమించుకున్న తర్వాత పెళ్లిళ్లు చేసుకుని సంసారాన్ని సజావుగా చేసుకుంటున్నారు. కానీ ఎక్కువ ఉదాహరణలు మాత్రం ప్రేమ - మోసం - హత్య - ఆత్మహత్య ల మధ్యనే మిగిలిపోతున్నాయి. కొన్ని ప్రేమలు అబ్బాయి కారణంగా విషాదంగా మారుతుంటే, మరికొన్ని ప్రేమలు అమ్మాయిల కారణంగా విషాదంగా మారుతున్నాయి. ఇప్పుడు ఇలాంటి ఒక సంఘటన గురించి తెలుసుకుందాం. కేరళ లోని తిరువనంతపురంలో రెండు రోజుల క్రితం జరిగిన ఒక హత్య ఎన్నో అనుమానాలకు దారి తీస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే,

నగరంలోని పరస్సాల లో నివసించే షారోన్ రాజ్ అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన గ్రీష్మ లు ఇద్దరూ ఒకరిని ఒకరు ప్రేమించుకున్నారు. అయితే గ్రీష్మ కొంతకాలం రాజ్ తో బాగానే ఉంది... ఇక అతనితో బోర్ అనుకుంటుదో ఏమో కానీ... విడిపోవాలన్న విషయాన్నీ వాళ్ళ మధ్యకు తీసుకు వచ్చింది. కానీ రాజ్ కు ఆమెతో కలిసి ఉండడం అంటేనే ఇష్టమని చాలాసార్లు చెప్పాడట. కానీ గ్రీష్మకు ఒక మంచి సంబంధం రావడంతో ఎలాగైనా ఇతన్ని అడ్డ్డు తొలగించుకోవాలి అనుకుంది. ఆదివారం రాజ్ ను ఇంటికి పిలిపించి ఒక జ్యూస్ లో విషాన్ని కలిపి ఇచ్చింది. దానితో రాజ్ అక్కడికక్కడే పచ్చగా వాంతులు చేసుకుని మరణించాడు.

అయితే ఈ హత్యలో గ్రీష్మ తల్లితండ్రులు కూడా భాగమయ్యారు అని తెలుస్తోంది. ఈ కేసును ఏడీజీపీ ఎంఆర్ అజిత్ కుమార్ దర్యాప్తు చేస్తున్నారు. గ్రీష్మను విచారించగా పలు కీలక విషయాలను వెల్లడించింది.. ఈ హత్యకు కారణంగా జ్యోతిష్యాన్ని కూడా వాడుకోవడం కొసమెరుపు. మరి ఈకేసులో ఇంకొన్ని విషయాలు వెలుగులోకి వస్తాయన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: