భార్య నగ్న ఫోటోలు యూట్యూబ్ లో పెట్టమన్న భర్త... హత్య చేసిన ప్రియుడు !

VAMSI
ఈ రోజుల్లో పెద్దవాళ్ళ ముందు వేదమంత్రాలతో మూడుముళ్ల సాక్షిగా జరుగుతున్న పెళ్లిళ్లకు గౌరవం లేకుండా పోతోంది అని చెప్పాలి. కేవలం క్షణికానందం కోసం పెళ్లి అనే బంధాన్ని గంగలో కలిపేస్తున్నారు. అయితే ఈ పెళ్లి అనే బంధాన్ని గౌరవించని వారిలో పురుషులు మరియు మహిళలు ఇద్దరూ ఉన్నారు. కానీ ఇప్పుడు మనము తెలుసుకోబోయే ఘటనలో మాత్రం భార్య భర్తనే పక్కా ప్లాన్ ప్రకారం హతమార్చింది. అయితే ఆమె తన భర్తను హతమార్చడానికి గల కారణాలు ఏమో ఇప్పుడు చూద్దాం.

విశాఖపట్టణం న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్ దగ్గర్లోనే వియ్యపువానిపాలెం లో ఈ సంఘటన చోటు చేసుకుంది. భర్త అప్పారావు తన భార్య ఉమ పిల్లలతో కలిసి అదే ప్రాంతంలో బ్రతుకు సాగిస్తున్నాడు. లారీ డ్రైవర్ కావడం మరియు తాగుడుకు బానిస కావడంతో సంపాదన అంతా తాగుడుకు అయిపోయేది. ఇంట్లో కనీస అవసరాలకు డబ్బు ఉండేది కాదు. దీనితో రోజూ వీరిద్దరి మధ్య ఏదో గొడవ జరుగుతూ ఉండేది. ఉమ కూడా వేరే పనిలో చేరింది... తాను పనిచేసే దగ్గర కాంట్రాక్టర్ వెంకటరెడ్డి తో పరిచయం ఏర్పడింది. తనతో అన్ని సమస్యలను పంచుకునేది.. దీనితో ఆమెపై వెంకటరెడ్డి కన్నేశాడు. అందుకే పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకున్నాడు.

తన భర్త అప్పారావు తో కూడా పరిచయం పెంచుకుని అప్పుడప్పుడు ఇంటికి వెళ్ళేవాడు. ఇంట్లో అవసరాలకు ఉమ తన దగ్గర డబ్బు తీసుకునేది. అలా వారిద్దరి మధ్యన అక్రమ సంబంధం ఏర్పడింది. అందుకే వీరిద్దరి సుఖం కోసం అడ్డుగా ఉన్న భర్త అప్పారావును చంపాలని ప్లాన్ వేశారు. అనుకున్న ప్రకారం అప్పారావు ని వెంకట రెడ్డి మరియు సెక్యూరిటీ గార్డ్ సింహాచలం తో కలిసి బాగా మద్యం సేవించి... సింహాచలం పనిచేసే అపార్ట్మెంట్ లో ఒక చెక్కతో వెంకటరెడ్డి గట్టిగా కొట్టడంతో అక్కడికక్కడే అప్పారావు మరణించాడు. ఇక సింహాచలం సాయంతో శవాన్ని వెయ్యబువానిపాలెం దగ్గర ఉన్న సులభ్ కాంప్లెక్స్ దగ్గర పడేశారు.

ఆదివారం పొద్దున్నే శవాన్ని చూసిన ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో...శవం మీద పది భార్య ఉమ చేస్తున్న అతిని గమనించిన పోలీసులు తమ స్టైల్ లో విచారించగా అసలు విషయాలు అన్నీ బయటకు వచ్చాయి. అయితే అందులో భార్య ఉమ చెప్పిన కారణం మాత్రం కొత్తగా ఉంది. భర్త అప్పారావు తమ ఆర్ధిక కష్టాలు తీరడం కోసం ఉమను నగ్న ఫోటోలు తీసి యూట్యూబ్ లో అప్ లోడ్ చేద్దాం అంటూ ప్రేరేపించేవాడట. అందుకే చంపాలని ప్లాన్ వేశామని ఒప్పుకుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: