శవాలను కూడా వదల్లేదు.. 101 మృతదేహాలతో.. ఛీ.. ఛీ?

praveen
ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే సభ్య సమాజంలో ఉన్న మనుషుల కంటే అటు అడవుల్లో ఉండే మృగాలే కాస్త నయం ఏమో అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మానవత్వానికి కేరాఫ్ అడ్రస్ అయిన మనిషి మృగం కంటే దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఏకంగా ఆడపిల్ల ఒంటరిగా కనిపించింది అంటే చాలు దారుణంగా అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలు నేటి రోజుల్లో కోకోల్లలుగా వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన మాత్రం మరింత హీనమైనది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటివరకు బ్రతికున్న వారిపై అత్యాచారం చేయడం గురించి విన్నాం. కానీ ఇక్కడ మాత్రం ఒక నీచుడు ఏకంగా చనిపోయిన వారి శవాలను కూడా వదలకుండా అత్యాచారం చేశాడు.



 ఇద్దరు మహిళలను హత్య చేసి మార్చురీలో శవాలపై లైంగిక దాడికి పాల్పడిన ఒక వ్యక్తి జీవిత ఖైదు అనుభవిస్తుండగా.. విచారణలో మరో 23 మంది చనిపోయిన మహిళలపై కూడా లైంగిక దాడి చేసినట్లు సంచలన విషయం బయటపడింది. డేవిడ్ పుల్లర్ అనే వ్యక్తి 1987 ఆగ్నేయ ఇంగ్లాండ్ లోని కెంట్ లో కేవలం నెలల వ్యవధిలోనే ఇద్దరు మహిళలను గొంతు కోసి చంపేశాడు.  మార్చురీలో ఇక చనిపోయిన మహిళల మృతదేహాలపై లైంగిక దాడికి పాల్పడినట్లు విచారణలో అంగీకరించాడు. ఇలా మొత్తంగా 101 మంది మహిళల మృతదేహాలతో అసభ్యంగా ప్రవర్తించాడట.


 అయితే గత ఏడాది ఈ నిందితుడు హత్య నేరం కింద శిక్ష అనుభవించినప్పుడు సామాన్యమైన సాధారణ జీవితానికి గడుపుతున్నట్లుగానే కనిపించాడని కానీ ఆ తర్వాతే దారుణమైన చర్యలకు పాల్పడ్డాడు విషయం తెలిసిందని ఇక పోలీసులు కూడా వెల్లడించాడు. పోలీసుల విచారణలో విస్తూ పోయే విషయాలు వెలుగులోకి వచ్చినట్లు న్యాయమూర్తి చెప్పుకొచ్చారు. అయితే ఇక ఒకానొక సమయంలో రెండు మృతదేహాలపై లైంగిక దాడి చేయటమే కాదు అంతా సెల్ఫోన్లో చిత్రీకరించి రాక్షసానందాన్ని పొందాడట. ఇక చిన్నపిల్లల మృతదేహాలను కూడా వదలకుండా లైంగిక దాడికి పాల్పడినట్లు విచారణలో తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: