ఇదెక్కడి దొంగతనంరా నాయనా.. సెల్ఫోన్ టవర్ ని ఎత్తుకెళ్లారు?

praveen
ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా దొంగలు బెడద కాస్త ఎక్కువగానే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక ఎక్కడికి అక్కడ పోలీసులు నేరాలను అరికట్టేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికీ అటు దొంగల బెడద మాత్రం ఎక్కడ తగ్గడం లేదు. ఎంతో పక్కాగా ప్లాన్ వేసుకుని మరి చోరీలకు పాల్పడుతూ ఏకంగా పోలీసులకే సవాలు విసురుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. కొంతమంది ఏకంగా తాళం వేసి ఉన్న ఇళ్లల్లోకి రహస్యంగా చొరబడి ఇక దొంగతనాలకు పాల్పడుతూ ఉన్నారు.

 ఇక ఇంకొంతమంది బ్యాంకుల దగ్గర కాపు కాచుకొని కూర్చుని ఇక ఎవరైనా డబ్బుతో బయటకు వచ్చారు అంటే చాలు ఇక వారి చేతుల నుంచి బ్యాగ్ లాక్కొని పరారవ్వడం లాంటివి కూడా జరుగుతూ ఉన్నాయి. ఇంకొంతమంది చైన్ స్నాచింగ్ కు పాల్పడుతూ చోరీలు చేస్తున్నారు.. ఇలా ఎక్కడ చూసినా దొంగల బెడద కాస్త ఎక్కువగానే ఉంది. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మాత్రం ఒక విచిత్రమైన దొంగతనం గురించి అని చెప్పాలి. సాధారణంగా దొంగలు ఎంతో సులభంగా చోరీ చేసే విధంగా ఉండే విలువైన వస్తువులను మాత్రమే ఎత్తుకు వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

 కాస్త రిస్క్ తో కూడుకున్న వస్తువులను ఎత్తుకెళ్లడం అంటే దొరికిపోతామేమో అని భయపడుతూ ఉంటారు. కానీ మహారాష్ట్రలోని వాలోజ్ లో మాత్రం దొంగలు మరింత బరితెగించారు అని చెప్పాలి. ఏకంగా ఒక సెల్ టవర్ ని ఎత్తుకెళ్లారు. ఎంతో ఎత్తులో ఉండే సెల్ టవర్ ను భాగాలుగా విడదీసి దొంగలు దోచేశారు. ఈ చోరీ కారణంగా సదరు కంపెనీకి 35 లక్షల మేర నష్టం వాటిలిందట. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతూ ఉండడం గమనార్హం. అయితే ఏకంగా సెల్ఫోన్ టవర్ ని ఎత్తుకెళ్లడం మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: