హెడ్ మాస్టర్ తల పగలగొట్టిన విద్యార్థి.. చివరికి?

praveen
తల్లి తండ్రి తర్వాత గురువే ప్రత్యక్ష దైవం అని చెబుతూ ఉంటారు పెద్దలు . ఎందుకంటే తల్లి తండ్రి జన్మను ఇస్తే ఇక ఆ జీవితానికి అసలైన రూపం ఇచ్చేది మాత్రం గురువే అని అంటూ ఉంటారు. ఇక నేటి రోజుల్లో ఎంతోమంది గొప్ప వాళ్ళు ఉన్నారు అంటే వాళ్లు కూడా ఒక గురువు దగ్గర పాఠాలు నేర్చుకున్న వారే అని చెప్పాలి.. అయితే ఒకప్పుడైతే స్కూల్లో టీచర్లకు ఎంతగానో గౌరవం ఇచ్చేవారు విద్యార్థులు. స్కూల్ లో చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా ఇక తమ టీచర్ ఎక్కడైనా కనిపించారు అంటే చాలు నమస్కారం పెట్టడం లాంటివి చేసేవారు.


 కానీ ఇటీవల కాలంలో మాత్రం ఇక బాగా చదవడం లేదు అని టీచర్లు కాస్త మందలించారు అంటే చాలు ఏకంగా టీచర్లపైనే కక్షగట్టి దాడులకు పాల్పడటం లాంటి ఘటనలు అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ ఉన్నాయ్. ఇక ఇటీవల తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగు చూసింది. కంద మంగళంలో హయ్యర్ సెకండరీ గ్రేడ్ స్కూల్ అండ్ కాలేజీ ఉంది. పరిసర ప్రాంతాల్లో నివాసం ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు అక్కడ ఆరవ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుకుంటూ ఉంటారు. స్కూల్ అండ్ కాలేజీలో జివిఆర్ చంద్రకుమార్ అనే వ్యక్తి హెడ్మాస్టర్ గా ఉద్యోగం చేస్తున్నాడు.


 అయితే ఈ వ్యక్తి అటు స్కూల్ విద్యార్థులు కాస్త కఠినంగానే ఉంటాడని.. ఇక అందరూ బాగా చదవాలని కోరుకుంటూ ఉంటాడని ఇక స్థానికులు కూడా చెబుతూ ఉంటారు. అయితే ఇటీవల ఇదే కాలేజీలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న విగ్నేష్ అనే యువకుడు చదువుకోవడం పక్కన పెట్టి జూనియర్లను రాగి చేయడం మొదలుపెట్టాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న హెడ్మాస్టర్ చంద్రకుమార్ విగ్నేష్ ను పిలిపించి మందలించాడు. బుద్దిగా చదువుకోకపోతే టీసీ ఇచ్చి పంపిస్తానంటు వార్నింగ్ ఇచ్చాడు. అయితే హెడ్మాస్టర్ వార్నింగ్ ఇచ్చిన అతని తీరులో మార్పు రాలేదు. దీంతో అతని స్కూల్ విడిచి వెళ్ళిపోవాలంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు.  దీంతో సహనం కోల్పోయిన విగ్నేష్ తన బ్యాగులోని పెద్ద కర్ర తీసుకొని హెడ్మాస్టర్ చంద్రకుమార్ తల మీద దాడి చేయడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: