మూడు వేలు ఇవ్వలేదని.. తండ్రిని 6 ముక్కలు చేశాడు?
ఎందుకంటే మానవత్వం అనేది మరిచిపోయి ఏకంగా ఉన్మాదులుగా మారిపోతున్న మనుషులు రోజురోజుకీ ఏకంగా బంధాలను కూడా కాలరాస్తూ దారుణంగా హత్యలు చేస్తూ ఉన్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఆస్తులు అంతస్తులు కోసం సొంత వారిని కూడా దారుణంగా ప్రాణాలు తీసేస్తున్న ఘటనలు సభ్య సమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తూ ఉన్నాయి. ఇక ఇలాంటి ఘటనలు చూస్తూ ఉంటే మనిషిలో మానవత్వం అనేది పూర్తిగా కనుమరుగైపోయింది అన్నది ఎంతో మంది చెబుతున్న మాట. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగు చూసింది.
ఏకంగా కని పెంచిన తండ్రి విషయంలో కాస్తయినా జాలి చూపించని కొడుకు దారుణంగా హత్య చేశాడు. 3000 రూపాయలు ఇవ్వలేదు అన్న కారణంలో తండ్రిని దారుణంగా చంపి ఇక శరీరాన్ని ఆరు భాగాలు చేశాడు కుమారుడు. ఇక ఆ భాగాలను పరిసర ప్రాంతాలలో పారేశాడు అని చెప్పాలి. అయితే ఎందుకు అతని తల్లి కూడా సహకరించడం గమనార్హం. బెంగాల్ లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో ఈ ఘటన వెలుగుచూసింది. అనుమానం రాకుండా తండ్రి పై మిస్సింగ్ కేసు పెట్టాడు సదరు వ్యక్తి. ఇక పోలీసులు అనుమానం వచ్చి తమదైన శైలిలో దర్యాప్తు చేపట్టడంతో అసలు విషయం ఒప్పుకున్నాడు.