సౌండ్ ఇబ్బందిగా ఉందని వెంటిలేటర్ ఆపేసిన మహిళ.. చివరికి?
ఇకపోతే ఇటీవల కాలంలో ఇలాంటి తరహా ఘటనలు సోషల్ మీడియాలో చాలానే వెలుగులోకి వచ్చాయి. మనం ఇప్పటివరకు సినిమాల్లో పలు సన్నివేశాలు చూశాము. ఏకంగా హాస్పిటల్ లో ఆక్సిజన్ పెట్టి ఉంటుంది. కానీ పక్కనే ఉన్న పేషెంట్ ఏకంగా ఆక్సిజన్ ఆన్ చేయడం మళ్ళీ ఆఫ్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక ఇలాంటివి చూసినప్పుడు ప్రేక్షకులు నవ్వుకుంటారు. కానీ నిజ జీవితంలో ఇలాంటిది జరిగితే మాత్రం చివరికి ప్రాణాల మీదికే వస్తుంది అని చెప్పాలి. ఇక్కడ మహిళ ఇలాంటిదే చేసింది. జర్మనీలో ఒక మహిళ చేసిన పని అందరినీ షాక్ అయ్యేలా చేస్తుంది అని చెప్పాలి.
మ్యాన్ హీమ్ పట్టణంలోని ఓ ఆసుపత్రిలో 72 ఏళ్ల బామ్మ చికిత్స పొందుతుంది. అదే సమయంలో పక్కన బెడ్ పై మరో మహిళ వెంటిలేటర్ పై ఉంది. సాధారణంగా వెంటిలేటర్ అన్న తర్వాత శబ్దం వస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే అర్ధరాత్రి సమయంలో వెండిలేటర్ శబ్దం చేస్తూ ఉండడంతో ఆ బామ్మ నిద్ర డిస్టర్బ్ అయింది. దీంతో ఏకంగా వెంటిలేటర్ ను ఆఫ్ చేసింది. ఇక వెంటిలేటర్ పై ఉన్న పేషెంట్ ఒక్కసారిగా కేకలు వేయడంతో ఆసుపత్రి సిబ్బంది అక్కడికి వచ్చి మళ్లీ వెంటిలేటర్ ను తిరిగి ఆన్ చేసి బామ్మను మందలించారు. ఇక ఆ బామ్మ అంతటితో ఆగకుండా మరోసారి వెంటిలేటర్ ను ఆఫ్ చేసింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ బామ్మను అరెస్టు చేశారు. ఈ ఘటన కాస్త అందర్నీ ఆశ్చర్యపోయేలా చేసింది.