దారుణం : పేరెంట్స్ ని చంపి.. పక్కనే నిద్రపోయాడు?

praveen
నవ మాసాలు మోసి ఎంతో బాధను అనుభవించి బిడ్డకు జన్మనిస్తుంది తల్లి. బిడ్డ పుట్టిన తర్వాత లోకం తీరు ఏంటో నేర్పిస్తూ కంటికి రెప్పలా కాచుకుంటాడు తండ్రి. ఇలా పసి గుడ్డును కంటికి రెప్పలా కాచుకుంటూ పెంచి పెద్దవాడిని చేస్తారు. ఏ కష్టం రాకుండా చూసుకుంటారు తల్లిదండ్రులు. అయితే పెరిగి పెద్దయిన పిల్లలు మాత్రం వృద్ధాప్యంలో తల్లిదండ్రుల పట్ల ఎంతో కర్కశంగా ప్రవర్తిస్తున్న ఘటనలు నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే.

 ఎందుకంటే ఏకంగా వృద్ధాప్యంలో అండగా నిలబడి ఎంతో జాగ్రత్తగా తల్లిదండ్రులను చూసుకోవాల్సింది పోయి.. ఆస్తిపాస్తుల కోసం దారుణంగా హింసిస్తున్న ఘటనలు సభ్య సమాజాన్ని తల దించుకునేలా చేస్తున్నాయ్. ఇక్కడ ఇలాంటి తరహా ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. తమిళనాడులోని తంజావూరు జిల్లా కుంభకోణం సమీపంలో పట్టీశ్వరం గ్రామం ఉంది. ఇదే గ్రామంలో గోవిందరాజు లక్ష్మీ దంపతుల నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె. ఇక ఈ దంపతుల పెద్ద కుమారుడు ప్రమాదంలో మరణించాడు అని చెప్పాలి. ఇక కుమార్తె అనారోగ్య సమస్యల కారణంగా ప్రాణాలు కోల్పోయింది.

 రెండో కుమారుడు రాజేంద్రన్ కి ఇంకా వివాహం జరగలేదు. అయితే వయసు పెరిగిపోతున్న అతనికి మాత్రం పెళ్లి కావడం లేదు అని ఎంతగానో ఆలోచనలో పడిపోయాడు రాజేంద్రన్. ఈ క్రమంలోనే మనస్థాపంతో మానసిక రోగిగా మారిపోయాడు. ఇక నిత్యం తన పెళ్లి విషయంపై గొడవ తీస్తూ తల్లిదండ్రులను వేధిస్తూ ఉండేవాడు. కొన్ని కొన్ని సార్లు తల్లిదండ్రులపై చేయి చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇకపోతే ఇటీవలే అతని చేష్టలు మరింత మీది మీరాయ్. ఏకంగా రాజేంద్రన్ తల్లిదండ్రులపై విచక్షణ రహితంగా కత్తితో దాడికి పాల్పడ్డాడు. శరీర భాగాలను నరికేశాడు. చనిపోయిన తల్లిదండ్రుల మృతదేహాల పక్కనే రెండు రోజుల పాటు పడుకున్నాడు. కానీ ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: