ప్రియుడికి నిశ్చితార్థం.. పెట్రోల్ బాటిల్ తో వచ్చిన యువతి.. చివరికి?
ఈ క్రమంలోనే ఎంతోమంది బాధితురాళ్లు అటు న్యాయం చేయాలంటూ ప్రియుడి ఇంటి ముందు ధర్నా చేస్తున్న ఘటనలు అయితే అందరిని అవాక్కేలా చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక్కడ మాత్రం ఓ యువతి ఇలా న్యాయం కోసం పోరాటం చేయలేదు ఏకంగా ప్రియుడు వేరే యువతి తో వినిష్ఠుతాదం చేసుకుంటే పెళ్లి మండపానికి పెట్రోల్ బాటిల్ తీసుకువెళ్లి అందరిని భయాందోళనకు గురిచేసింది. ఐదేళ్లుగా ఆ యువతి యువకులు ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకొని వదిలేసాడు.
అత్యాచారం కేసు పెడితే అరెస్టై మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చాడు. వివాహం ఫిక్స్ చేసుకొని నిశ్చితార్థం కూడా చేసుకుంటున్నాడు. విషయం తెలుసుకున్న ప్రేయసి నిశ్చితార్థం వేదిక వరకు పెట్రోల్ బాటిల్ తో వెళ్లి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. ఘటన ఛత్తీస్గడ్ లోని బిలాస్ పూర్ సివిల్ లైన్ ప్రాంతంలో వెలుగు చూసింది. అశుతోష్ అనే యువకుడు ప్రియురాలికి తెలియకుండా ఎంగేజ్మెంట్ చేసుకుంటూ ఉండగా బాధితురాలు అక్కడికి చేరుకుంది. పెట్రోల్ బాటిల్ పట్టుకొని రావడంతో అందరూ భయాందోళనకు గురయ్యారు. ఇక ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరింపులకు పాల్పడడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి వచ్చిన పోలీసులు బాధితురాలని నచ్చజెప్పి ప్రయత్నం చేసి సఖి సెంటర్ కు తరలించారు.