కూతురిపై వల్లమాలిన ప్రేమ.. భార్యకు విడాకులిచ్చి.. తండ్రి ఏం చేశాడంటే?
ఇకపోతే ఇటీవల ఈక్విడార్ లో వెలుగు చూసిన ఒక ఘటన మాత్రం ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కూతురు మీద అమితమైన ప్రేమను పెంచుకున్న ఒక తండ్రి ఏకంగా ఎవరు తీసుకొని ఒక కఠిన నిర్ణయం తీసుకున్నాడు అని చెప్పాలి. ఇంతకీ ఏం జరిగిందం..టే ఈక్విడార్ కు చెందిన రేనే సలీనాస్ రామోస్ అనే వ్యక్తి తన కుమార్తెల సంరక్షణ కోసం షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. ఏకంగా రిజిస్ట్రీ కార్యాలయానికి వెళ్లి చట్టబద్ధంగా తన లింగాన్ని మార్చుకున్నాడు.
భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత కూతుర్లను తన వద్ద ఉంచుకోవాలని భావించాడు సదరు వ్యక్తి. చట్ట ప్రకారం ఇలా చేయడం కుదరదు. అందుకే కూతుర్లపై ఉన్న వల్ల మాలిన ప్రేమ కారణంగా వారిని వదులుకునేందుకు అతని మనసు ఒప్పుకోలేదు. దీంతో పిల్లల సంరక్షణ బాధ్యతను తల్లికి అప్పగిస్తారు. దీంతో తండ్రి కావడం వల్ల తనకు కూతురు దూరమవుతున్నారూ భావించి ఏకంగా లింగాన్ని మార్చుకునేందుకు కూడా సిద్ధమయ్యాడు. కూతుర్ల కోసం మహిళగా కూడా మారిపోయాడు. ఈ క్రమంలోనే చట్ట ప్రకారం మహిళలకు మాత్రమే పిల్లలను చూసుకునే హక్కు ఉండడంతో ఇక ఇప్పుడు తాను కూడా స్త్రీనే అని నేను కూడా ఒక తల్లిని అని నాకు పిల్లలను అప్పగించాలంటూ కోర్టును ఆశ్రయించగా.. ఇది కాస్త సంచలనంగా మారిపోయింది..