సర్పంచ్ సూసైడ్.. కారణం ఏంటో తెలుసా?
అయితే ఇటీవలే కాలంలో సర్పంచులుగా ఎన్నికైన వారు గ్రామాభివృద్ధిని చేసేందుకు ప్రభుత్వం నుంచి సరైన నిధులు రాకపోవడంతో ఇక తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. కొంతమంది అయితే ఇక తమ దగ్గర ఉన్న డబ్బులు మొత్తం గ్రామాభివృద్ధి కోసం ఖర్చు పెట్టడం కానీ ఆ తర్వాత ప్రభుత్వం నుంచి బిల్లులు వస్తాయేమో అని పడిగాపులు కాస్తూ ఎదురు చూడటం లాంటిది జరుగుతూ ఉంది. ఇక్కడ ఓ సర్పంచ్ విషయంలో ఇలాంటిదే జరిగింది. దీంతో మనస్థాపం చెందిన సదరు వ్యక్తి చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక ఇలా ఏకంగా గ్రామానికి ప్రథమ పౌరుడు అయిన సర్పంచ్ ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది.
ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలోని సిర్గాపూర్ మండలంలో వెలుగులోకి వచ్చింది. పెద్ద ముబారక్ పూర్ లో సర్పంచ్ గా ఎన్నికయ్యారు దిగంబర్ అనే వ్యక్తి. ఇకపోతే ఇటీవల ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గత కొన్ని రోజుల నుంచి అతని ఆరోగ్యం బాగా ఉండడం లేదట అయితే గ్రామాభివృద్ధి కోసం తన దగ్గర ఉన్న డబ్బులు మొత్తం ఖర్చు చేశాడట. కానీ బిల్లులు రాకపోవడం తో తీవ్రమనస్థాపన చెందాడు. గ్రామానికి న్యాయం చేయలేకపోతున్నానని.. ఇక ఈనెల 1వ తేదీన రాజీనామా కూడా చేశాడు. దిగంబర్ ఇక ఇటీవల ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.