ఎడమ కాలికి నొప్పి.. డాక్టర్ దగ్గరికి వెళ్తే కుడికాలికి ఆపరేషన్.. చివరికి?

praveen
ప్రజలంతా వైద్యులను దేవుడిగా కొలుస్తుంటారు. ఆసుపత్రులకు ఏదైనా అనారోగ్యం వల్ల వెళ్తే వైద్యులకు తమ బాధలు చెప్పుకుని వాపోతుంటారు. అయితే ప్రస్తుత రోజుల్లో వైద్యం అంతా ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది. కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న చికిత్సలకు కూడా పెద్ద మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారు. ఒక్కోసారి తప్పుడు వైద్య చికిత్సలు చేస్తుంటారు. ఆపరేషన్ చేసి కడుపులో కత్తెర వదిలేయడం, ఒకదానికి బదులు మరో సర్జరీ చేసేయడం వంటివి జరుగుతుంటాయి. ఇదే కోవలో కేరళలో షాకింగ్ ఘటన జరిగింది. ఓ రోగికి తప్పుడు శస్త్రచికిత్సను వైద్యుడు చేసేశాడు. ప్రస్తుతం కప్పిపుచ్చుదామని అనుకున్నా, ప్రస్తుతం ఈ ఘటన వైరల్ అవుతోంది.
కేరళలోని 60 ఏళ్ల సాజినా సుకుమారన్ అనే మహిళ కొన్నాళ్లుగా ఎడమ కాలి నొప్పితో బాధ పడుతోంది. ఎడమ కాలుకు గాయం చికిత్స కోసం మావూర్ రోడ్‌లోని నేషనల్ హాస్పిటల్‌కు ఆమె వెళ్లారు. అక్కడ సర్జన్ డాక్టర్ బెహీర్షాన్ ఆమెకు సర్జరీ చేశారు. అంతకు ముందు కాలికి ఎక్స్ రే తీశారు. అయితే సర్జరీ మాత్రం ఆమె కుడి కాలికి చేసేశారు. శస్త్ర చికిత్స సమయంలో ఆమెకు మత్తు మందు ఇచ్చారు. దీంతో శస్త్రచికిత్స తర్వాత ఆమె స్పృహ లోకి వచ్చింది. తనకు ఎడమ కాలి నొప్పి అయితే కుడి కాలికి ఆపరేషన్ చేసినట్లు తేలింది. దీంతో ఆమె తన కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది. వారు వెంటనే డాక్టర్‌ను పిలిచి అడిగారు. అయితే ఆమె ఎడమ కాలికి కూడా సమస్య ఉందని డాక్టర్లు చెప్పారు. అందు వల్లే ఎడమ కాలికి ఆపరేషన్ చేసినట్లు వెల్లడించారు. తనకు ఎడమ కాలిలో సమస్య ఏదీ లేదని బాధితురాలు చెబుతోంది. కుడి కాలి కోసమే ఎక్స్ రే తీశారని, ఆపరేషన్ కు ముందు అన్ని టెస్టులు కుడి కాలికి మాత్రమే చేశారని ఆమె వెల్లడించింది. దీంతో ఆ ఆసుపత్రి వైద్యులు ఇరకాటంలో పడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: