పెంపుడు ఎలుకను వండుకొని తిన్న మహిళ.. చివరికి?

praveen
ప్రస్తుతం ప్రపంచం మొత్తం డ్రగ్స్ అనే మత్తులో మునిగిపోతుందా అంటే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తూ ఉంటే మాత్రం ప్రతి ఒక్కరు అవుననే సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే నేటి రోజుల్లో యువత మాత్రమే కాదు అటు పెద్ద వాళ్ళు సైతం డ్రగ్స్ అనే మాయలో పడిపోతున్నారు. తెలియకుండానే ఇక్కడ డ్రగ్స్ కి బానిసలుగా మారిపోతూ చివరికి చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. అయితే మన దేశంలోనే కాదు ఇక పాశ్చాత్య దేశాల్లో అయితే ఇలాంటి డ్రగ్స్  ట్రెండ్ ఎక్కువగా నడుస్తుంది. చిన్న పిల్లల దగ్గరనుంచి యూత్ పెద్దవాళ్ళు అందరూ కూడా డ్రగ్స్ మాయలో పడిపోతున్నారు అని చెప్పాలి.

 కొంతమంది అయితే డ్రగ్స్ కి బానిసగా మారిపోయి కనీసం ఏం చేస్తున్నామో కూడా అర్థం కాని విధంగా విచక్షణ లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు. అయితే ఇక అన్ని దేశాల ప్రభుత్వాలు కూడా డ్రగ్స్ పై నిషేధాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పటికీ ఇక అక్రమార్కులు ఇలా జనాలకు డ్రగ్స్ ని చేరవేస్తూ ఇక అందరూ బానిసలుగా మారిపోయేలా చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక మహిళ డ్రగ్స్ కి బానిసై చేసిన పని కాస్త సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి. ఆమె ఎంతో ప్రేమగా ఒక ఎలుకను పెంచుకుంది. కానీ డ్రగ్స్ కి బానిసైన తర్వాత పెంపుడు ఎలుకను చంపి వండుకొని ఆరగించింది.

 యునైటెడ్ కింగ్ డమ్ కు చెందిన 39 ఎమ్మా పార్కర్ తన కూతురు ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న చిట్టి ఎలుకను కూరగా వండుకొని ఆరగించింది. మిస్టర్ నోబుల్ అనే పేరు ఉన్న చిన్న ఎలుకను దారుణంగా చంపి తిన్న వీడియోని ఇక సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. ఇక నెటిజన్లు ఈ వీడియో పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు ఆమెను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. కోర్టు ఆమెకు ఏడాది జైలు శిక్ష విధించింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: