చెప్పు పోయిందని ఫిర్యాదు.. రైల్వే అధికారులు ఏం చేశారంటే?

praveen
ఇటీవల కాలంలో సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చింది . దీంతో సామాన్యులు సెలబ్రిటీలు అనే తేడా లేకుండా పోయింది అని చెప్పాలి. ఎందుకంటే సామాన్యులు ఎలా అయితే సోషల్ మీడియాను ఉపయోగించుకోగలుగుతున్నారో.. సెలబ్రిటీలు సైతం అదే రీతిలో సోషల్ మీడియాలో తమ పోస్టులు పెట్టగలుగుతున్నారు. అంతేకాదండోయ్ ఇక సామాజిక సమస్యలపై స్పందించడం ప్రతి ఒక్కరికి ఎన్నో విషయాలపై అవగాహన తీసుకురావడానికి కూడా సోషల్ మీడియా బాగా ఉపయోగపడుతుంది. ఇక సమస్యలపై అటు అధికారులకు ఫిర్యాదు చేయడానికి కూడా సోషల్ మీడియా ఉపయోగకరంగా మారిపోయింది అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే ఎంతోమంది నేటిజన్స్ తమ స్థానిక నాయకులను సోషల్ మీడియాలో ట్యాగ్ చేస్తూ ఇక తాము ఎదుర్కొంటున్న సమస్యల గురించి వారికి తెలిసేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక ఈ విషయంపై వెంటనే స్పందిస్తున్న అధికారులు స్థానిక నాయకులు సమస్యను పరిష్కరించే దిశగా ఆలోచన చేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఇక ఆ సమస్య చిన్నదా పెద్దదా అన్న తేడా లేకుండా వెంటనే అధికారులు స్పందిస్తూ ఉండడం నేటి రోజుల్లో చూస్తూ ఉన్నాము. ఇక ఇటీవల ఇలాంటిదే జరిగింది. ఏకంగా ఒక రైల్వే ప్రయాణికుడు తన చెప్పు పోయింది అంటూ ఫిర్యాదు చేస్తే రైల్వే అధికారులు ఏకంగా పోయిన చెప్పును తిరిగి తెచ్చి ఇచ్చారు.

 ఇది కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. తెలంగాణలోని హైదరాబాద్ నగరంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. స్టేషన్ ఘన్పూర్ కు చెందిన రైలు ప్రయాణికుడు తాను రైలు ఎక్కుతున్న సమయంలో చెప్పు పోయిందని తిరిగి తీసుకురావాలి అంటూ రైల్వే అధికారులకు సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదు చేశాడు. దీంతో ఇక ఈ ఫిర్యాదు పై ఉన్నతాధికారులు స్పందించి ఆదేశాలు జారీ చేశారు. దీంతో రైల్వే అధికారులు అతని చెప్పును వెతికి మరి తీసుకువచ్చి అప్పగించారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: