నో బాల్ ఇచ్చినందుకు.. అంపైర్ ను నరికి చంపాడు?

praveen
ఇండియాలో క్రికెట్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అన్న విషయం తెలిసిందే. అయితే సాధారణంగా భారత్లో జాతీయ క్రీడా హాకీ అని చెబుతూ ఉంటారు. కానీ ఇక ప్రస్తుతం భారత ప్రజలందరికీ జాతీయ క్రీడ ఏది అంటే అది క్రికెటేనేమో అనే విధంగా మారిపోయింది. ఇక నేటితరం విద్యార్థులు అందరూ కూడా ఇదే గట్టిగా ఫిక్స్ అయిపోతున్నారు. ఆ రేంజ్ లో భారత్ లో క్రికెట్ కి క్రేజ్ ఉంది అని చెప్పాలి. అయితే కేవలం అంతర్జాతీయ మ్యాచ్లు మాత్రమే చూసి ఎంజాయ్ చేయడం కాదు ప్రతి ఒక్కరు కూడా క్రికెట్ ఆడుతూ తెగ ఆనంద పడిపోతూ ఉంటారు. తమ గల్లీలో క్రికెట్ ఆడుతూ చిన్నలు పెద్దలు అనే తేడా లేకుండా అందరూ ఎంజాయ్ చేసేస్తూ ఉంటారు.

 అయితే ఇలా గల్లీ క్రికెట్ అయినా లేదా అంతర్జాతీయ క్రికెట్ అయినా సరే అంపైర్ గా ఉన్న వ్యక్తి ఇచ్చిన నిర్ణయమే తుది నిర్ణయం అన్న విషయం తెలిసిందే. అయితే అంతర్జాతీయ క్రికెట్లో అయినా అటు ఎంపైర్ ఇచ్చిన నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రివ్యూ తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. కానీ గల్లీ క్రికెట్లో అలాంటి సదుపాయం ఉండదు. ఇక అబ్బాయిలు ఏది చెబితే అదే ఫాలో కావాల్సి ఉంటుంది. అయితే కొన్ని కొన్ని సార్లు అబ్బాయిలు తప్పుడు నిర్ణయాలు ఇస్తూ ఇక మ్యాచ్ స్వరూపాన్ని మార్చేస్తూ ఉంటారు. ఇక్కడ జరిగిన ఘటన గురించి తెలిస్తే మాత్రం క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు అని చెప్పాలి.

 ఎందుకంటే తప్పుడు నిర్ణయం ఇచ్చాడు అన్న కారణంగా ఏకంగా మ్యాచ్ ఎంపైర్ గా ఉన్న వ్యక్తిని దారుణంగా నరికి చంపాడు ఒక ఆటగాడు. సరదాగా ఆడుకునే క్రికెట్లో ఇలా విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన ఒడిస్సా లోనే కటక్ జిల్లా మహిషా ల్యాండ్ లో జరిగింది అని చెప్పాలి. ఒక మ్యాచ్కు లక్కీ రౌత్ అనే యువకుడు అంపైర్గా వ్యవహరించాడు. ఈ క్రమంలోనే ఓ బంతిని నోబాల్ గా ప్రకటించాడు. దీంతో ఆగ్రహం చెందినా ఫీల్డింగ్ జట్టు  తరపు ఆటగాడు జగారౌత్ తన సోదరుడితో  కలిసి లక్కీ రౌత్ ను దారుణంగా దాడి చేశారు. కత్తితో నరికాడు. ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితుడు చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు  నిందితులను అరెస్టు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: