శృంగారం విషయంలో గొడవ.. భార్యను కాపాడి చంపేసిన భర్త?
ఇలా కష్టాల్లో తోడు నీడగా ఉంటారు అనుకున్న వారు దారుణంగా ప్రాణాలు తీస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా భయపడుతూనే బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి. ముఖ్యంగా భార్యాభర్తల బంధం లో అయితే ఇలాంటి హత్యలు ఆత్మహత్యలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. చిన్న చిన్న కారణాలకే కట్టుకున్న వారిని దారుణంగా హత మారుస్తున్నారు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటనే వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. మనం సినిమాల్లో ఎక్కువగా సైకోలను చూస్తూ ఉంటాం. ఏకంగా ప్రమాదంలో ఉన్న వారిని కాపాడి మరి ప్రాణాలు తీయడం చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇలాంటిదే జరిగింది.
శృంగారం విషయంలో భర్తతో జరిగిన వాగ్వాదం ఏకంగా ఒక మహిళ ప్రాణం తీసింది. చత్తీస్గడ్ లోని జాషుపూర్ జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది. మద్యం సేవించి వచ్చిన భర్త శంకర్ రామ్ తో శృంగారం చేసేందుకు ఆశా బాయ్ నిరాకరించింది. ఇద్దరి మధ్య ఇదే విషయంపై వాగ్వాదం జరగడంతో మనస్థాపంతో ఆశాభాయ్ బావిలోని దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే బావిలోకి దూకిన భర్త ఆమెను రక్షించాడు. కానీ బయటికి వచ్చాక మరోసారి వీరి మధ్య వివాదం జరిగింది. దీంతో భార్యా ప్రాణం కాపాడిన భర్త చివరికి ఆమె ప్రాణం తీసేసాడు. దారుణంగా దాడి చేసి చంపేశాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.