రెండో పెళ్లిపై కోరిక.. చివరికి అతనేం చేశాడంటే?
ఎందుకంటే నేటి రోజుల్లో పెళ్లి అనేది కేవలం ఒక కమర్షియల్ ఎలిమెంట్ గా మాత్రమే మారిపోయింది. ఎంతోమంది యువతులు మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్న వరుడు వస్తే బాగుంటుంది అని భావిస్తున్నారు. ఇక ఎంతోమంది యువకులు భారీగా కట్నం తెచ్చే యువతి భార్యగా వస్తే అంతకంటే ఇంకేం కావాలి అనుకుంటున్నారు. అయితే ఇలా పెళ్లి చేసుకున్న తర్వాత అయినా సుఖంగా ఉంటున్నారా అంటే పరాయి వ్యక్తుల మోజులో పడిపోయి చివరికి ప్రాణాలు పోయే పరిస్థితిని కొని తెచ్చుకుంటున్నారు అని చెప్పాలి.
ఇటీవలే ముంబైలోని ధారావిలో కూడా ఇలాంటి ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. రెండో పెళ్లి చేసుకోవడం కోసం ఏకంగా రెండేళ్ల కొడుకుని దారుణం గా చంపేశాడు ఇక్కడ ఒక దుర్మార్గమైన తండ్రి. టైలర్ గా పని చేసే అతనికి ఓ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే తనను పెళ్లి చేసుకోవాలంటే.. భార్య కొడుకును చంపాలని సదరు మహిళ కండిషన్ పెట్టింది. దీంతో దారుణానికి ఒడిగట్టాడు ఆ దుర్మార్గుడు. తోలుత కొడుకు గొంతు కోసి చంపేసి మృతదేహాన్ని వాగులో పడేశాడు. బంధువుల ఫిర్యాదుతో పోలీసులు నిందితున్ని అదుపు లోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించాడు. ఈ ఘటన స్థానికం గా సంచలనం గా మారి పోయింది.