భర్తకు దూరంగా యువతి.. లొంగదీసుకునేందుకు మాజీ ప్రియుడి స్కెచ్.. చివరికి?
ఇక్కడ ఒక యువతకి ఇలాంటి చేదు అనుభవం ఎదురయింది. ఏకంగా భర్తకు దూరంగా ఉంటున్న యువతిని లొంగదీసుకోవాలని ప్రయత్నించాడు ఒక యువకుడు. దీంతో భయపడిపోయిన యువతి వెంటనే పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. వోలింపస్ రామస్వామి నగర్‌కు చెందిన 20 ఏళ్ల యువతి కోవై ఉక్కడం ప్రాంతంలో నివాసం ఉండే శర్వాననన్ అనే యువకుడిని గతంలో ప్రేమించింది. అయితే వీరికి విభేదాలు రావడంతో విడిపోయారు.
ఇక తర్వాత యువతి మరో వ్యక్తిని వివాహం చేసుకుంది అని చెప్పాలి. కొన్ని సంవత్సరాలు వారి కాపురం సజావుగానే సాగింది. కానీ ఆ తర్వాత మనస్పర్ధలు మొదలయ్యాయి. దీంతో ఇక భర్తకు దూరంగా ఒంటరిగానే ఉండటం మొదలు పెట్టింది సదరు వివాహిత. ఈ క్రమంలోనే మాజీ ప్రియుడు ఆమెపై కన్నేసాడు. ఎలాగైనా లొంగదీసుకోవాలని ప్రయత్నించాడు. ఇక తనను ప్రేమించాలి అంటూ వేధింపులకు గురి చేసేవాడు. ఆ యువతి నిరాకరించడంతో దాడి చేస్తాను అని బెదిరింపులకు పాల్పడేవాడు. దీంతో వేధింపులు తట్టుకోలేకపోయిన వివాహిత పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శరవ నన్ అరెస్టు చేసి జైలుకు తరలించారు.