ఒళ్ళు గగుర్పొడిచే వీడియో.. నాగుపామును ఎలా పట్టుకున్నాడో చూడండి?

praveen
పామును చూస్తే ప్రతి ఒక్కరికి భయమే. అయితే పామంటే తమకు భయం లేదని కొంతమంది లోవలోపల భయం పెట్టుకున్న పైకి మాత్రం ధైర్యవంతులుగా నటించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ కొన్ని కొన్ని సార్లు ఆ భయం బయటికి కనిపించడం జరుగుతూ ఉంటుంది అని చెప్పాలి. అయితే డైరెక్ట్ గా పాములు చూడడానికి ఎంతగానో భయపడిపోయో జనాలు.. అటు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయే పాము వీడియోలు చూడాలంటే మాత్రమే ఎంతగానో ఆసక్తి కనబరుస్తూ ఉంటారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే పాములకు సంబంధించిన వీడియో ఏదైనా సోషల్ మీడియాలోకి వస్తే అది క్షణాల్లో వైరల్ గా  మారిపోతూ ఉంటుంది.

 ఇప్పుడు ఇలాంటి తరహా వీడియోనే ఒకటి ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది. ఒక భారీ నాగుపాము బుసలు కొడుతూ దూసుకు వస్తున్న సమయంలో ఒక వ్యక్తి ఎంతో చాకచక్యంగా ప్రాణాలకు తెగించి దానిని పట్టుకున్న తీరు చూసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు. ఎన్నోసార్లు నాగుపాము బుసలు కొడుతూ దాడి చేసేందుకు ప్రయత్నించిన.. అతను అదరకుండా బెదరకుండా ఎంతో ఓర్పుగా భారీ విష సర్పాన్ని పట్టేశాడు. ఈ వీడియో కాస్త ట్విట్టర్ వేదిక వైరల్ గా మారిపోయింది. ఈ ఘటన గోవాలో జరిగింది అన్నది తెలుస్తుంది.

 ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ సడన్గా ఒక భారీ నాగూపాము జనాలు మధ్యలోకి వచ్చేసింది. అంత పెద్ద భారీ నాగూపామును చూసి జనాలు ఒక్కసారిగా భయంతో ఊగిపోయారు. అక్కడి నుంచి పరుగులు పెట్టారు. ఇలాంటి సమయంలోనే స్నేక్ క్యాచర్ కి సమాచారం అందించారు. ఇక రంగంలోకి దిగిన స్నేక్ క్యాచర్ కీ కూడా ఆ భారీ పాము పట్టుకోవడం కత్తి మీద సాముల మారిపోయింది అని చెప్పాలి. ఎన్నోసార్లు అతని మీద దాడి చేసేందుకు పాము ప్రయత్నించింది. అయినప్పటికీ ఎంతో చాకచక్యంగా వ్యవహరించి చివరికి నాగూపామును  ఎంతో జాగ్రత్తగా చాకచక్యంగా బంధించాడు అని చెప్పాలి. ఈ వీడియో చూసి అతని ధైర్యానికి హాట్సాఫ్ చెబుతున్నారు నెటిజెన్స్ .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: