ఇన్స్టెంట్ కర్మ అంటే ఇదేనేమో.. సెకండ్లలో జరిగిపోయింది?
ఈ క్రమంలోనే సాధు జంతువుల విషయంలో కర్కషంగా వ్యవహరించిన వారికి కర్మ ఫలితం అనుభవించేలా దేవుడు చేస్తూ ఉంటాడు అని ఎంతో మంది పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో మనుషుల్లాగానే దేవుడు కూడా ఫాస్ట్ అయిపోయాడు అన్నది తెలుస్తుంది. ఎందుకంటే మనిషి ఏదైనా తప్పు చేస్తే ఇన్స్టెంట్ కర్మ అనుభవించే విధంగా పరిస్థితులను తీసుకువస్తున్నాడు. ఇప్పుడు ఇలాంటి వీడియోనే ఒకటి ట్విటర్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఒక మూగ జీవాన్ని గాయపరచడానికి ప్రయత్నించిన ఆకతాయికి.. ఇన్స్టంట్ కర్మ రూపంలో తగిన శాస్తి జరిగింది.
ఇంతకీ ఏం జరిగిందంటే.. ఇద్దరు యువకులు బైక్ పై వెళుతున్నారు. అయితే ఇలా వెళ్తున్నప్పుడు వారి దారిలో వారు వెళ్లకుండా ఇక రోడ్డుపై కనిపించిన ఒక గేదెను ఇబ్బంది పెట్టి రాక్షసానందం పొందాలి అనుకున్నాడు ఒక యువకుడు. ఈ క్రమంలోనే బైక్ పై వెళ్తున్న సమయంలో రోడ్డు పక్కన ఉన్న ఒక గేదెను తన్నాడు. అయితే ఆ తర్వాత వెంటనే కర్మ ఫలితాన్ని అనుభవించాడు. గేదెను తన్నిన వెంటనే అతను బైక్ మీద నుంచి జారి కింద పడిపోయాడు. ఇక ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి అన్నది ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇది చూసిన తర్వాత ఇన్స్టంట్ కర్మ అంటే ఇదేనేమో అని నెటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు.