17 ఏళ్లుగా ఆహారం లేదు.. కేవలం కూల్ డ్రింక్ తోనే బతుకుతున్నాడు?

praveen
బ్రతకడానికి ఊపిరి తీసుకోవడం ఎంత ముఖ్యమో.. ఆహారం నీరు తీసుకోవడం కూడా అంతే ముఖ్యం అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు కూడా  రోజు వారి జీవితంలో తమకు నచ్చిన ఆహారం తీసుకుంటూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇలా ఆహారం తీసుకోకుండా ఉండడం అంటే అది నిరాహార దీక్షను చేయడం లాంటిదే. ఒకవేళ ఇలా ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉండాలి అంటే కేవలం ఒక వారం రోజులు మాత్రమే బ్రతికే ఛాన్స్ ఉంటుంది. కానీ అంతకుమించితే మాత్రం చివరికి ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఏర్పడుతూ ఉంటుంది అని చెప్పాలి.


 కానీ ఒక్కరోజు రెండు రోజులో కాదు ఏకంగా నెలల తరబడి ఎలాంటి ఆహారాన్ని తీసుకోకుండా ఉంటున్న జనాలు కూడా ప్రపంచంలో ఉన్నారు అన్న విషయం అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చే ఘటనల ద్వారా ప్రతి ఒక్కరికి అర్థమవుతూ ఉంటుంది అని చెప్పాలి. గతంలో కొంతమంది రాళ్లు తిని లేదా ఇసుక తిని లేదంటే ప్రతిరోజు చాయ్ తాగుతూనే ఆహారంకి దూరంగా ఏళ్ల తరబడి బ్రతికినవారు  చాలామంది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయారు   ఇక ఇప్పుడు ఇలాంటి వ్యక్తి మరోసారి వార్తల్లో నిలిచాడు అని చెప్పాలి  ఒకటి కాదు రెండు కాదు 17 ఏళ్లుగా అతను ఆహారం తీసుకోవట్లేదు.


 అదేంటి ఆహారం తీసుకోకుండా 17 ఏళ్లుగా అతను ఎలా బ్రతుకుతున్నాడు అని అనుమానం వచ్చింది. కదా కేవలం కూల్ డ్రింక్స్ మాత్రమే తాగుతూ అతను 17 ఏళ్లుగా జీవించాడు. ఇరాన్ కు చెందిన ఘోలం రజా కూల్ డ్రింక్స్ ని ఆహారంగా తీసుకుంటున్నాడు. ఘన ఆహారం అంటే విరక్తి కలగడంతో ఇలా చేస్తున్నట్టు తెలిపాడు. అయితే గతంలో తన గొంతులో ఏదో ఇరుక్కున్న భావన కలిగిందని.. వైద్యులకు చూపించిన ప్రయోజనం లేకుండా పోయిందని చెప్పుకొచ్చాడు. అప్పటినుంచి ఘన ఆహారంపై విరక్తి కలిగిందని.. ఇక కూల్ డ్రింక్ తాగడమే అలవాటుగా మార్చుకున్నాను అని.. ప్రతిరోజు మూడు పెద్ద కూల్ డ్రింక్ బాటిల్స్ ని లాగించేస్తాను అంటూ చెబుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: