పొట్టిగా ఉందని.. ఆ యువతీ ఏం చేసిందో తెలుసా?
వేరసి నేటి రోజుల్లో ఆత్మహత్యలకు సంబంధించిన ఘటనలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. తప్ప ఎక్కడ తగ్గుముఖం పట్టడం లేదు అని చెప్పాలి. ఈ చిన్న సమస్య వచ్చిన పరిష్కారం ఒక్కటే ఆత్మహత్య అన్న విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఒక యువతి ఇలాగే అనవసరమైన విషయానికి కుంగుబాటుకు గురై చివరికి జీవితాన్ని అర్థంతరంగా ముగించింది అని చెప్పాలి. సాధారణంగా ఈ భూమి మీద పుట్టిన వారందరూ ఒకే రూపురేఖలతో ఉండరు అన్న విషయం తెలిసిందే. ఒకరు పొడుగ్గా ఉంటే మరొకరు పొట్టిగా ఉంటారు.
అయితే ఇక్కడ ఒక యువతి పొట్టిగా పుట్టింది. పొట్టిగా పుట్టడం తనకు శాపం అని అనుకుంది. ఇక చివరికి తన జీవితాన్ని ముగించేందుకు కూడా సిద్ధమైంది. జార్ఖండ్ లోని రాంచీలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. శ్వేత అనే 22 ఏళ్ల యువతి పొట్టిగా ఉండడం వల్ల పెళ్లి కావట్లేదు అని బాధపడింది. చివరికి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు మూడు సంబంధాలు పెళ్లి వరకు వచ్చి ఆగిపోవడంతో మనస్థాపానికి గురైంది పేరెంట్స్ సర్ది చెప్పిన బాధ నుంచి బయటపడలేకపోయింది. ప్రస్తుతం తన అక్క బావతో కలిసి ఉండగా.. వారు ఇంట్లో లేని సమయంలో సూసైడ్ చేసుకుంది.