ఏడాది క్రితం తనను తాను పెళ్లి చేసుకుంది.. ఇప్పుడేం చేసిందంటే?

praveen
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ప్రత్యేకమైన ఘట్టం అన్న విషయం తెలిసిందే. పెళ్లి విషయంలో యువతి యువకులు అందరూ కూడా ఎన్నో ఆశలు పెట్టుకుంటూ ఉంటారు. తమకు నచ్చిన భాగస్వామిని జీవితంలోకి ఆహ్వానించి వందేళ్లు ఎంతో సంతోషంగా బ్రతకాలని ఆశ పడుతూ ఉంటారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో ఇటీవల కాలంలో అందరూ కూడా తమ పెళ్లిని ఎంతో ఘనంగా నిర్వహించడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. కొంతమంది అయితే పెళ్లి కోసం తహతకు మించి మరీ ఖర్చు చేసుకోవడం చూస్తూ ఉన్నాం. ఇటీవల కాలంలో ఎన్నో పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారిపోతున్నాయి.



 ఇకపోతే ఇటీవల కాలంలో పెళ్లి అనే విషయానికి సరికొత్త అర్ధాన్ని చెబుతూ కొంతమంది చిత్ర విచిత్రమైన  పనులు చేస్తూ ఉండడం చూస్తూ ఉన్నాము. సాధారణంగా యువతీ యువకులు పెళ్లి చేసుకోవడం ఇప్పటివరకు చూసాము. కానీ ఇటీవల కాలంలో ఇద్దరు యువతులు లేదా ఇద్దరు మగాళ్లు పెళ్లి చేసుకోవడం లాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇంకొంతమంది అయితే పెళ్లి చేసుకొని భాగస్వామిని జీవితంలోకి ఆహ్వానించడం కాదు.. తమను తామే పెళ్లి చేసుకుంటూ సరికొత్త ట్రెండుకు కారణం అవుతున్నారు అని చెప్పాలి.



 గుజరాత్ కు చెందిన క్షమాబిందు అనే యువతి కూడా గత ఏడాది ఇలాగే తనను తాను పెళ్లి చేసుకుని వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక ఇప్పుడు మరోసారి అందరి దృష్టిని ఆకర్షించే విధంగా వింతైన పని చేసే వార్తల్లో లో నిలిచింది. ఏకంగా తన మొదటి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంది క్షమాబిందు. ఇందుకు సంబంధించిన ఫోటోలను వీడియోలను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో మరోసారి వార్తల్లో నిలిచింది.  తనను తాను వివాహం చేసుకున్న నాటి నుంచి ఏడాది పాటు గడిచిన కాలం ఎలా ఉందో అన్న విషయాలను కూడా చెప్పుకొచ్చింది క్షమాబిందు. ఇక నేటిజన్స్  ఆమెకు విషెస్ చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: