30 ఏళ్ల క్రితం హత్య చేశాడు.. కానీ ఇప్పుడెలా దొరికాడో తెలుసా?

praveen
ఒక మనిషి ప్రాణం తీయడం అనేది ఇటీవల కాలంలో చాక్లెట్ తిన్నంత ఈజీగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. కాస్తయినా జాలీ దయ చూపించకుండా ఎంతోమంది దారుణంగా ఎదుటి వ్యక్తుల ప్రాణాలు తీస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. చిన్నచిన్న కారణాలకే క్రూరమృగాల్లాగా మారిపోతున్న మనుషులు దారుణంగా ప్రవర్తిస్తున్నారు   అయితే ఇలా హత్యలకు పాల్పడటమే కాదు ఏకంగా పోలీసులకు సైతం సవాలు విసురుతున్నారు నేరస్తులు. ఎందుకంటే హత్యకు పాల్పడిన చోట ఏ చిన్న క్లూ కూడా వదలకుండా ఎంతో చాకచక్యంగా తప్పించుకోగలుగుతున్నారు నేరస్తులు. ఈ క్రమంలోనే హత్యలకు సంబంధించిన కేసులను ఛేదించడం పోలీసులకు సవాలుగా మారిపోతుంది.

 అయితే ఇలా ఎవరైనా నేరస్థుడు హత్యకు పాల్పడిన తర్వాత ఇక పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరగడం చూస్తూ ఉంటాం. అయితే నిజాన్ని ఎక్కువ కాలం దాచలేము అని అంటూ ఉంటారు పెద్దలు. అయితే కొంతమంది నేరస్తులు కూడా ఇలాగే పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతూ ఉన్న.. వాళ్ళు చేసిన చిన్న పొరపాటు కారణంగా చివరికి పోలీసులకు దొరికిపోయి జైలు శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది.  ఇక ఇప్పుడు 30 ఏళ్ల క్రితం హత్య చేసిన ఒక వ్యక్తి విషయంలో ఇలాంటిదే జరిగింది.

 30 ఏళ్ల క్రితం హత్య చేసి పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్న నేరస్తుడు.. చివరికి నోరు జారీ దొరికిపోయాడు. ముంబై లోనవాలాకు చెందిన అవినాష్ పవార్ 1993లో ఒక వృద్ధ జంటను హత్య చేసి పారిపోయాడు. ఆ తర్వాత ఔరంగాబాద్ కు చేరుకుని అమీర్ పవర్ గా పేరు మార్చుకున్నాడు.  అక్కడే పెళ్లి చేసుకుని భార్యను రాజకీయాల్లోకి దింపాడు. అయితే ఇటీవల ఒక పార్టీకి వెళ్లి పీకల దాకా తాగాడు. ఇక ఎవరో తెలియని వ్యక్తుల దగ్గర తాను చేసిన హత్య గురించి అసలు నిజాన్ని చెప్పాడు. ఇక ఈ విషయం పోలీసులు దాకా వెళ్లడంతో రంగంలోకి దిగిన పోలీసులు అతని అరెస్టు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: