పెళ్లయిన వారానికే.. ట్విస్ట్ ఇచ్చిన అక్కచెల్లెళ్లు?

praveen
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రత్యేకమైన ఘట్టం. ఈ క్రమంలోనే నచ్చిన వారిని జీవితంలోకి ఆహ్వానించి సరికొత్తగా జీవితాన్ని ప్రారంభించాలని యువతి యువకులు కూడా ఎంతగానో ఆశ పడుతుంటారు అని చెప్పాలి. మరి ముఖ్యంగా అమ్మాయిలు అయితే కాబోయే వరుడు గురించి ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. దాంపత్య బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత ఇక భర్త పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడని.. తన ఇష్టాఇష్టాలను గౌరవిస్తాడని ఆశ పడుతూ ఉంటారు అని చెప్పాలి. ఇలా కోటి ఆశలతో పెళ్లి అనే బంధం లోకి అడుగుపెడుతూ ఉంటారు.


 అయితే ఇలా పెళ్లి విషయంలో అమ్మాయిలు కోటి ఆశలను పెట్టుకుంటారు అన్నది ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు పెళ్లి అనేది ఎంతో మంది అమ్మాయిలకు కమర్షియల్ ఎలిమెంట్ గా మారిపోయింది. కొంతమంది ఎక్కువ డబ్బు ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకుంటున్నారు. వయస్సును కూడా చూడకుండా తమకంటే చాలా పెద్ద వయసు ఉన్న వారిని కూడా పెళ్లి చేసుకుంటున్నారు. ఇంకొంతమంది పెళ్లి అనే పేరుతో అందిన కాడికి దోచుకుపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ ఇద్దరు అక్క చెల్లెలు ఇలాంటిదే చేశారు.


 అన్నదమ్ములను పెళ్లి చేసుకున్నారు అక్క చెల్లెలు. కానీ చివరికి అత్తారింటికి కన్నం వేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ లో వెలుగులోకి వచ్చింది. భరత్ గుప్తా, రోహిత్ గుప్తలకు యూపీ గోరక్పూర్ కు చెందిన సంజన, అంజలితో ఈనెల 11వ తేదీన వివాహం జరిగింది. అయితే ఇటీవల కుటుంబ సభ్యుల కళ్ళు కప్పి 2.5 లక్షలు నగదు, బంగారు నగలతో నవ వధువులు ఇద్దరు కూడా పారిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు అని చెప్పాలి. వెంటనే ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు వరుడి కుటుంబ సభ్యులు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: