పదివేల అప్పు తిరిగివ్వలేదని.. ఏం చేసారో తెలుసా?

praveen
ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనల గురించి తెలిసిన తర్వాత సభ్య సమాజంలో బ్రతుకుతుంది మనుషులా లేకపోతే మనుషుల రూపంలో ఉన్న మానవ మృగాలా అన్నది కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది అని చెప్పాలి. ఎందుకంటే సాటి మనుషులు విషయంలో ఎంతో జాలి దయతో వ్యవహరించే మనుషులు ఇక ఇప్పుడు మానవత్వాన్ని పూర్తిగా మర్చిపోతున్నారు అని చెప్పాలి. అయితే ఈ భూమి మీద మనిషి తో పాటు ఎన్నో జీవులు ఉన్నా ఇక మనిషిలో ఉండే మానవత్వం, ఆలోచన శక్తి ఇక మనిషి అనే జీవిని ప్రత్యేకంగా నిలబెట్టింది. కానీ  ఇప్పుడు మనుషులు మాత్రం అడవుల్లో ఉండే జంతువుల కంటే అతి దారుణంగా ప్రవర్తిస్తున్నారు.


 చిన్నచిన్న కారణాలకే ఎదుటివారిపై దారుణంగా దాడి చేయడం కొన్ని కొన్ని సార్లు ఏకంగా ప్రాణాలు తీసేయడం లాంటి ఘటనలు కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ముఖ్యంగా ఇటీవల కాలంలో అప్పు ఇచ్చిన వారు తీసుకున్న వారి విషయంలో వ్యవహరిస్తున్న తీరు అయితే మరింత దారుణంగా ఉంది. ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన ఇలాంటి కోవలోకి చెందినదే.  ఒక వ్యక్తి తీసుకున్న 10000 రూపాయల లోన్ తిరిగి చెల్లించలేదు అన్న కారణంతో ఇద్దరు దుర్మార్గులు దారుణానికి పాల్పడ్డారు. ఏకంగా ఇద్దరు వ్యక్తులను దారుణంగా కాల్చి చంపారు.


 ఈ ఘటన ఎక్కడో కాదు దేశ రాజధాని ఢిల్లీలో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. ఆర్కే పురం అంబేద్కర్ కాలనీకి చెందిన లలిత్ ఒక వ్యక్తి దగ్గర నుంచి 10000 రూపాయల లోన్ తీసుకున్నాడు.. వాటిని తిరిగి చెల్లించడంలో ఆలస్యమైంది. ఇదే విషయంపై లలిత్ ను ప్రశ్నిస్తే డబ్బు తిరిగి చెల్లించేందుకు ఇంకొంత సమయం పడుతుంది అంటూ బదులిచ్చాడు. లోన్ ఇచ్చినవారు ఆగ్రహంతో ఊగిపోయి   పెద్ద గ్యాంగ్ తో లలిత్ ఇంటి ముందు ప్రత్యక్షమయ్యారు. 20 మంది ఆయుధాలతో లలిత్ ఇంటిపై దాడి చేశారు. అంతేకాదు బయటనుంచి ఇంట్లోకి వస్తున్న లలిత్ ఇద్దరి చెల్లెలను కూడా దారుణంగా కాల్చి చంపారు. ఘటనపై  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: