వామ్మో.. 80 ఏళ్ళ వృద్ధురాలికి.. కరెంట్ బిల్ ఎంత వచ్చిందో తెలుసా?
లక్ష రూపాయల కరెంట్ బిల్ ఏంటి గురు మీరేమైనా జోక్ చేస్తున్నారా.. ఒక సామాన్యుడు ఇంటికి లక్ష రూపాయల కరెంట్ బిల్లు రావడం ఏంటి.. సామాన్యుడి ఇల్లు ఏమైనా పెద్ద అపార్ట్మెంట్ లాగా ఉంటుందా అంతలా బిల్లు రావడానికి అని ఎదురు ప్రశ్నిస్తారు ఎవరైనా. కానీ ఇక్కడ మాత్రం ఇలాంటిదే జరిగింది. ఇటీవల కాలంలో ఎంతోమంది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో సామాన్యులకు సైతం లక్షల రూపాయల కరెంట్ బిల్లు వస్తూ ఉండడం జరుగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఇలాంటి తరహా ఘటనలు చాలానే సోషల్ మీడియాలో వెలుగులోకి వస్తున్నాయ్. ఇక ఇప్పుడు కర్ణాటకలో కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.
చింతపల్లి కి చెందిన 80 ఏళ్ల గిరిజమ్మ ఓ రేకుల ఇంట్లో ఉంటుంది. రెండు బల్బులు మినహా ఎలాంటి వస్తువులను వినియోగించట్లేదు సదరు వృద్ధురాలు. అయితే ఆమెకు ఆరు నెలల తర్వాత ఏకంగా లక్ష 3315 కరెంటు బిల్లు వచ్చింది. దీంతో ఈ కరెంటు బిల్లు చూసి ఒక్కసారిగా షాక్ అయింది సదరు వృద్దురాలు. ఈ విషయంతో అధికారులు స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. మీటర్ రీడింగ్ సమస్య కారణంగా తప్పిదం జరిగిందని.. ఆమె ఈ బిల్లు కట్టాల్సిన అవసరం లేదని.. ఇలా చేసిన అధికారులపై చర్యలు తీసుకుంటాము అంటూ హెచ్చరించారు.