భార్యపై 92 మందితో లైంగికదాడి.. చేయించింది భర్తే?
ఈ దారుణమైన ఘటన ఫ్రాన్స్ లోని మజాన్ లో చోటు చేసుకుంది. డొమినిక్ అనే వ్యక్తి తన భార్యకు ప్రతిరోజు రాత్రి తినే అన్నంలో లోరజపామ్ అనే సెడేటివ్ మందును కలిపేవాడు. ఆ అన్నం తిన్న ఆమె కొంత సేపటికి స్పృహ తెలియకుండా నిద్రపోయేది. ఆ తరువాత డొమినిక్ పరాయి మనుషులను పిలిచి భార్యతో దగ్గరుండే లైంగిక దాడి చేయించేవాడు. ఆ దారుణాన్ని వీడియో కూడా తీసేవాడు. అవన్నీ యూఎస్ బీ డ్రైవ్ లో స్టోర్ చేసేవాడు. ఇలా వయసుతో సంబంధం లేకుండా 26 ఏళ్ల నుంచి 73 ఏళ్ల మధ్య వయసు వారితో కూడా చేయించేవాడట. సొంత భార్యనే ఇలా చేయడం కలకలం రేపింది. ఆ వీడియోలు తీసిన యూఎస్ బీ డ్రైవ్ ఇప్పుడు పోలిసుల దగ్గర ఉంది. ఈ ఘటన 2011 నుంచి 2020 మధ్య జరిగాయని వారు తెలిపారు. మొత్తం 92 లైంగిక దాడి చేసినట్టు పోలీసులు గుర్తించి అందులో 51 మందిని అరెస్ట్ చేసారు. మిగితా వారు ఎవరని పోలీసులు గాలిస్తున్నారు.
డొమినిక్ ఈ దారుణాలు చేసేటప్పుడు రూల్స్ కూడా పెట్టుకున్నాడంట. తన ఇంటికి వచ్చే వారు పెర్ఫ్యూమ్ కొట్టుకొని వస్తే రాణించేవాడు కాదంట. వాసన వస్తే తన భార్య స్పృహలోకి వస్తుందని జాగ్రత్తలు తీసుకునేవాడు. వాహనాలను కూడా ఇంటికి దూరంగా పార్క్ చేయించేవాడు. చేతులు వేస్తే ఎక్కడ స్పర్శ తెలుస్తుందనేమోనని వచ్చే వారికి వేడి నీళ్లతో చేతులు కడుక్కుని వెళ్లాలని కోరేవాడు. ఇలాంటి భర్తలు కూడా ఉంటారా అని ఈ వార్త విన్న వాళ్ళందరూ షాక్ అవుతున్నారు. ఆ మహిళకు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు.