టాలీవుడ్ డ్రగ్స్‌ కేసు.. ఆ హీరోయిన్లకు లింకు?

Chakravarthi Kalyan
టాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ కుంభకోణం బయటపడింది. కబాలి నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ సూత్రధారి అని ఇటీవల ఆయన్ని పోలీసులు అరెస్టు చేశారు. ఆయన కాల్ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. కేపీ చౌదరి ఇచ్చిన సమాచారం మేరకు టాలీవుడ్ లో కొంతమంది సెలబ్రెటీల పేర్లు బయటకు వచ్చాయి. బిగ్ బాస్ ఫేం, రామ్ గోపాల్ వర్మ తో కాళ్లు నాకించుకున్న అషు రెడ్డి, ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉండే సురేఖ వాణి, నటి జ్యోతి పేర్లు బయటకొచ్చాయి. అయితే తమకు సంబంధంలేదని వారు ఇటీవల ప్రకటించారు.

వీరికి డ్రగ్స్ అమ్మినట్లు ప్రాథమిక విచారణలో కేపీ చౌదరి తెలిపినట్లు సమాచారం. అంతే కాకుండా బెజవాడలో ఉన్న చాలా మందికి ఈ డ్రగ్స్ సరఫరా చేసినట్లు తెలుస్తోంది. గతంలో కూడా పూరి జగన్నాథ్, చార్మి తదితర సినిమా సెలబ్రెటీలను డ్రగ్స్ కేసులో విచారించారు. కెల్విన్ అనే డ్రగ్ సప్లయర్ వీరికి అమ్మినట్లు ఉన్న సమాచారంతో పోలీసులు విచారణ చేపట్టారు.

అది ఏళ్ల తరబడి కొనసాగి చివరకు ఏదో మూలకు వెళ్లిపోయింది. ప్రస్తుతం కబాలి నిర్మాత కేపీ చౌదరి ఫోన్ ఓపెన్ అయితే చాలా మంది సెలబ్రెటీలు కూడా బయట పడే అవకాశం ఉంది. ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలు ఉన్న ఎంతో మందికి డ్రగ్ సప్లయ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే డ్రగ్ సప్లయి చేసే వారు ఇందులో నిందితులుగా భావిస్తారు.

కానీ వాటికి అలవాటు పడి వాడుతున్న వారిపై పెద్దగా కేసులు ఏమీ ఉండవు. డ్రగ్స్ మత్తులో నుంచి వారిని బయటకు తీసుకొచ్చేందుకు కౌన్సిలింగ్ ఇవ్వడం తప్ప ఏమీ చేయరనే వాదన ఉంది. గతంలో కూడా ఎన్నో డ్రగ్ కేసుల్లో చాలా మంది సెలబ్రెటీల పేర్లు బయటకు వచ్చినా వారికి పడిన శిక్షలు పెద్దగా లేనట్లే తెలుస్తోంది. కాబట్టి సంచలనం టాలీవుడ్ లో కుంభకోణం, ఏదో జరిగిపోతుందనేది అన్ని మీడియా క్రియేట్ చేస్తున్న హైప్ అనే చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: