రెండేళ్ల క్రితం జరిగితే.. ఇప్పుడు వెలుగులోకి వచ్చింది?

praveen
ప్రేమ అనేది ఎన్నో మధురానుభూతులు సమ్మేళనం. ఒక్కసారి ప్రేమలో పడిన తర్వాత జీవితాంతం గుర్తుండిపోయే ఎన్నో తీపి జ్ఞాపకాలు పొందవచ్చు అని ప్రతి ఒక్కరు చెబుతూ ఉంటారు. అంతే కాదు ప్రేమలో మునికి తేలుతున్న వారు ఈ లోకాన్ని మరిచిపోయి మరి ఎంజాయ్ చేస్తూ ఉంటారు అని అంటూ ఉంటారు. కానీ ఇటీవలే కాలంలో ప్రేమ అనేది మధురానుభూతులకు కాదు మర్డర్లకు ఆత్మహత్యలకు చిరునామాగా మారిపోయింది ఏమో అనే భావన ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. ఎందుకంటే ప్రేమ అనే ముసుగు వేసుకొని అవసరాలు తీర్చుకుంటున్న వారే నేటి రోజుల్లో ఎక్కువగా కనిపిస్తున్నారు.


 ఈ క్రమంలోనే ఏకంగా ప్రాణంగా ప్రేమించి గుడ్డిగా నమ్మిన వారిని నట్టేట ముంచేస్తున ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. కొంతమంది ఆర్థిక అవసరాల కోసం ప్రేమ అనే మూసుగు వేసుకుంటుంటే.. ఇంకొంతమంది శారీరక అవసరాల కోసం ఇలాంటి నాటకానికి తెరలేపుతున్నారు అని చెప్పాలి. సమయం సందర్భం చూసి అసలు నిజ స్వరూపాన్ని బయటపెట్టి ప్రేమించిన వారికే షాక్ ఇస్తున్నారు. ఇక మరి కొంతమంది ప్రేయసి తమను దూరం పెడుతుంది అన్న కారణంతో ప్రాణంగా ప్రేమించాము అని చెప్పిన వారే.. చివరికి ప్రియురాలి ప్రాణాలు తీసుకున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి.


 ఇక ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవలోకి చెందినది అని చెప్పాలి. ఆస్ట్రేలియాలో పంజాబ్ కు చెందిన యువతి హత్యకు సంబంధించిన ఘటన 2 ఏళ్ళ తర్వాత వెలుగులోకి వచ్చింది. జాస్మిన్ కౌర్ నర్సింగ్ కోసం ఆస్ట్రేలియా కు వెళ్ళింది. తారీక్ జ్యోత్ తో ఆమెకు పరిచయం ఏర్పడింది. పరిచయం ప్రేమగా మారింది. తర్వాత అతడి ప్రవర్తన నచ్చక అతని దూరం పెట్టింది. దీంతో అతడు ఆమెపై పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే కళ్ళకు గంతులు కట్టి శరీరాన్ని కేబుల్ వైర్ తో కట్టేసి సజీవంగానే యువతిని పాతిపెట్టాడు. చివరికి యువతి ప్రాణాలు కోల్పోయింది. కాగా 2021లో జరిగిన ఘటన ఇటీవల వెలుగులోకి రాగా.. నిందితుడు నేరాన్ని అంగీకరించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: