ఆన్లైన్లో కండోమ్స్ ఆర్డర్ చేశాడు.. కానీ అడ్రస్ మార్చడం మర్చిపోయాడు.. చివరికి?
అది ఇది అనే తేడా లేదు అన్ని రకాల వస్తువులను కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే డెలివరీ చేసేందుకు ఎన్నో కంపెనీలు ప్రస్తుతం సర్వీస్ లను అందిస్తూ ఉన్నాయి. దీంతో ఈ టెక్నాలజీకి బాగా అలవాటు పడిపోయిన మనిషి.. ప్రతి ఒక్కటి కూడా ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టేస్తూ ఉన్నాడు. ఇక కావాల్సిన ప్లేస్కు కావాల్సిన టైంకి తెప్పించుకుంటున్నాడు అని చెప్పాలి. అయితే కొన్ని కొన్ని సార్లు మాత్రం ఆన్లైన్ ఆర్డర్స్ కారణంగా ఊహించని చిక్కుల్లో పడిపోవడం లాంటి ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయ్. ఇక్కడ ఒక యువకుడికి కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. అతను ఆన్లైన్ లో కండోమ్స్ ఆర్డర్ చేశాడు. అదే చిక్కుల్లో పడేసింది. అదేంటి ఆన్లైన్లో చాలామంది కండోమ్స్ ఆర్డర్ చేస్తారు.
అలా ఆర్డర్ చేసినందుకు చిక్కుల్లో ఎందుకు పడతాడు అనుకుంటున్నారు కదా. అయితే ఆన్లైన్లో కండోమ్స్ అయితే ఆర్డర్ చేశాడు. కానీ అడ్రస్ మార్చడం మర్చిపోయాడు. చివరికి ఇంట్లో వాళ్లకి అడ్డంగా దొరికిపోయాడు. బాగా ఆన్లైన్ షాపింగ్ కి అలవాటు పడ్డ యువకుడు స్విగ్గి ఇన్స్టామాట్ లో కండోమ్స్ ఆర్డర్ చేసి ప్రస్తుతం తాను అంటున్న అడ్రస్ ఇవ్వడం మర్చిపోయాడు. చివరికి ఆ పార్సెల్ కాస్త ఇంటికి చేరింది. తమ కుమారుడు సర్ప్రైజ్ గిఫ్ట్ ఆర్డర్ చేశాడని ఆతృతగా పార్సెల్ ఓపెన్ చేసిన తల్లికి కండోమ్స్ చూసి షాక్ అయింది. ఈ విషయాన్ని యువకుడి సోదరి ఆన్లైన్లో పంచుకోవడంతో వైరల్ గా మారిపోయింది.