సెల్ ఫోన్ చార్జర్.. మనిషి ప్రాణం తీసింది?
అంతలా సెల్ఫోన్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగంగా మారిపోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఎన్ని పనులున్నా పక్కన పట్టేసి గంటల తరబడి సెల్ఫోన్లో కాలం గడపడానికే నేటి రోజుల్లో జనాలు కూడా ఇష్టపడుతూ ఉన్నారు. ఎక్కడికి వెళ్లినా ఏం చేస్తున్న అరచేతిలో సెల్ఫోన్ ఉండాల్సిందే. అయితే ఇలా మనిషిలో పెరిగిపోతున్న సెల్ఫోన్ వ్యామోహం ఇక చివరికి ప్రాణాల మీదికి తెస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయ్. ఏకంగా చార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడటం కారణంగా ఇప్పటికే చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ ఇలాంటి ఘటన జరిగింది. అయితే చార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడటం వల్ల ప్రాణం పోలేదు. కానీ ఇక సెల్ ఫోన్ చార్జర్ పేలి ప్రాణం పోయింది.
ఈ ఘటన ములుగు జిల్లా రామన్నగూడెంలో వెలుగులోకి వచ్చింది. మొబైల్ కు ఛార్జింగ్ పెడుతుండగా చార్జర్ పేలడంతో విద్యుత్ షాక్కు గురైన కూలి 35 ఏళ్ల షేక్ భాషా కన్నుమూసాడు. ఇతనికి ఏపీ పశ్చిమగోదావరి జిల్లా అనంతపల్లి స్వగ్రామం.. కాగా బ్రిడ్జి పనుల్లో రాడ్ బెండింగ్ పనుల కోసం ములుగు వచ్చాడు. అయితే మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.