45ఏళ్ళ వ్యక్తికి..13 ఏళ్ళ కూతురినిచ్చి పెళ్లి చేసిన తండ్రి?
కానీ ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరిలో కూడా ఉన్నతంగా ఆలోచించే శక్తి పెరిగింది. దీంతో ఆడపిల్లలకు తొందరగా పెళ్లి చేయడం కాదు.. బాగా చదివించి మంచి ఉద్యోగాలు చేసిన తర్వాతే పెళ్లి అనే ఊసు ఎత్తుతున్నారు తల్లిదండ్రులు. కానీ ఇంకా అక్కడక్కడ ఎంతో మంది ఆడపిల్లలు ఇంకా ఈ లోకం తీరును అర్థం చేసుకునే వయస్సు కూడా రాకముందే పెళ్లి అనే బంధం లోకి అడుగుపెడుతున్నారు. అంతేకాదు ఏకంగా పెళ్లయి పిల్లలు ఉన్నవారికి అభం శుభం తెలియని బాలికలను ఇచ్చి పెళ్లి చేస్తున్న ఘటనలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
ఇటీవల నిజాంబాద్ జిల్లాలో కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. అబ్బాపూర్ బి తండాకు చెందిన ఒక తండ్రి ఏకంగా 60000 తీసుకుని తన పదమూడేళ్ల కూతురుని 45 ఏళ్ల వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసేందుకు సిద్ధపడ్డాడు. సాయిబ్ రావు అనే 45 ఏళ్ల వ్యక్తికి గతంలోనే పెళ్లయింది. ఇక అతనికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇలాంటి వాడికి ఇక 13 ఏళ్ల కూతురిని ఇచ్చి పెళ్లి చేయడానికి ఏ తండ్రి అంగీకరించడు. కానీ ఇక్కడ ఈ తండ్రి మాత్రం నీచమైన పని చేశాడు. గుట్టు చప్పుడు కాకుండా అర్థరాత్రి పెళ్లి జరిపించాడు. అయితే పోలీసులు విషయం తెలుసుకుని అక్కడికి వచ్చేసరికే సాయిబ్ ఇక బాలికను తీసుకొని వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ప్రస్తుతం అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.