విధి ఆడిన నాటకం.. కొడుకు జననం.. తండ్రి మరణం?
అంతా ఎంతో సంతోషంగా సాగిపోతుంది అనుకున్న సమయంలో ఊహించని ఘటనలు చివరికి ప్రాణాలను తీసేస్తూ ఉంటాయి అని చెప్పాలి. కొన్ని కొన్ని ఘటనలను చూసిన తర్వాత ఆ దేవుడికి నిజంగా దయలేదా అనే భావన ప్రతి ఒక్కరికి కూడా కలుగుతుంది. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఘటన అయితే ప్రతి ఒక్కరి మదిని మెలిపెట్టేస్తుంది అని చెప్పాలి. వారికి పెళ్లయి 16 ఏళ్ళు అయింది. కానీ పిల్లలు పుట్టలేదు. చివరికి ఎన్నో పూజలు చేసి.. ఎంతో మంది డాక్టర్ల దగ్గరికి తిరిగితే 16 ఏళ్లకు భార్య గర్భం దాల్చింది. బిడ్డ పుట్టాక ఆ బిడ్డను భర్తకు చూపించి మురిసిపోవాలని అనుకుంది.
కానీ విధి వారి విషయంలో వింత నాటకం ఆడింది. ఒకవైపు బిడ్డ పుట్టింది అన్న ఆనందంలో ఉండగా అంతలోనే భర్త అనారోగ్యంతో హాస్పిటల్ లో చేరాడు. కిడ్నీలు ఫెయిల్ కావడంతో చివరికి ప్రాణాలు కోల్పోయాడు. అదే సమయంలో పురిటి నొప్పులతో అతడి భార్య కొల్లాపూర్ పట్టణంలోని హాస్పిటల్ లో చేరింది. కొన్ని గంటలకే బాబుకు జన్మనిచ్చింది.. ఆమెకు ఏమవుతుందో అని కుటుంబ సభ్యులు భర్త మరణం విషయం చెప్పలేదు. హైదరాబాద్ నుంచి శవాన్ని ఊరికి తీసుకొచ్చి వారికి తెలియకుండానే అంతిమ సంస్కారాలు నిర్వహించారు. వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండలం షేర్ పల్లి లో జరిగింది. రాజశేఖర్, సునీత దంపతులు అయితే పదహారేళ్ల తర్వాత ఆమెకు గర్భం దాల్చగా.. పురిటి నొప్పులతో ఆసుపత్రిలో చేరింది. అయితే రాజశేఖర్ అంతలోనే ఇక మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆమెకు భర్త చనిపోయిన విషయం తెలియక.. ఇంకా భర్త వస్తాడని కొడుకుని చూపించాలని ఎదురుచూస్తుంది ఆ మహిళ.