ఉద్యోగం నుండి పీకేసారని.. అతనేం చేశాడో తెలుసా?
ఈ క్రమంలోనే కొంతమంది చేసే పిచ్చి పనులు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వెలుగులోకి వస్తు ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ గా మారిపోయిన ఒక న్యూస్ గురించి కలిసి వామ్మో ఇలాంటి ఉద్యోగులు కూడా ఉంటారా అని ప్రతి ఒక్కరు కూడా అవాక్కవుతున్నారు అని చెప్పాలి. సాధారణంగా ఉద్యోగంలో ఒక వ్యక్తిని పెట్టుకోవాలా తీసేయాలా అనేది కేవలం యాజమాన్యం నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. వాళ్లకి ఇష్టముంటే పెట్టుకుంటారు లేదంటే తీసేస్తారు.
ఇక్కడ ఒక వ్యక్తిని ఉద్యోగం నుంచి తీసేసారు. అయితే అది మనసులో పెట్టుకున్న వ్యక్తి చివరికి పగ తీర్చుకోవాలని అనుకున్నాడు. దీంతో తాను పని చేస్తున్న బార్ కే నిప్పు పెట్టాడు. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మెక్సికో లోని సానోర రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. కాగా ఇలా చనిపోయిన వారిలో ఏడుగురు పురుషులు నలుగురు మహిళలు ఉండగా.. మరో నలుగురు గాయపడ్డారు. అయితే ఈ కేసు దర్యాప్తులో పోలీసులు కీలక విషయాలను కనుగొన్నారు. మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఓ ఉద్యోగిని బార్ నుంచి తొలగించారు. అయితే సదరు ఉద్యోగి తనను బార్ నుంచితొలగించారు అనే కోపంతో అతను ఇలా బార్ కి నిప్పు అంటించినట్లు పోలీస్ విచారణలో తేలింది.