అయ్యబాబోయ్.. జిమ్ ట్రైనర్ ఎలా చనిపోయాడో చూడండి?
అయితే అటు వ్యాయామం విషయంలో కూడా ఈ సూత్రం వర్తిస్తూ ఉంటుంది సాదరణం కంటే ఎక్కువగా వ్యాయామం చేస్తే చివరికి ఇక ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది అని చెప్పాలి ఈ క్రమంలోనే ఎంతోమంది ఇలా అతిగా వ్యాయామం చేసి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య కూడా పెరుగుతుంది ఇక్కడ ఏకంగా ఫిట్నెస్ ట్రైనర్ మృతి చెందిన ఘటన కాస్త సంచలనగా మారిపోయింది అని చెప్పాలి. ఇండోనేషియాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. అతిగా వెయిట్ లిఫ్ట్ చేసాడు. కానీ దానిని కంట్రోల్ చేయలేకపోయాడు. చివరికి బార్బెల్ మెడ పై పడి ఫిట్నెస్ ట్రైనర్ మృతి చెందాడు.
ఇలా అతని మెడ పై పడిన బార్ బెల్ బరువు ఏకంగా 210 కిలోలు కావడం గమనార్హం. స్థానికంగా ఉన్న ఒక జిమ్లో ఫిట్నెస్ ట్రైనర్ గా కొనసాగుతున్నాడు జస్టిన్ విక్కీ అనే 33 ఏళ్ళ వ్యక్తి ఎప్పటిలాగానే బాలిలోని జింలో వ్యాయామానికి వెల్లాడు. ఈ క్రమంలోనే 210 కిలోల బరువైన బార్బెల్ ను భుజాలపై పట్టుకుని కసరతులు మొదలుపెట్టాడు. అయితే ఇక ఈ బార్బెల్ ను ఎత్తి స్క్వాట్ స్ఫూర్తి చేసి తిరిగి పైకి లేచే సమయంలో బరువు దాటికి బ్యాలెన్స్ కోల్పోయాడు. దీంతో అది కాస్త మెడ పై పడింది. దీంతో అతడి మెడ విరిగిపోయింది. చివరికి అక్కడే కుప్పకూలిపోయాడు. పక్కనే సహాయకుడు కాపాడేందుకు ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది. అక్కడున్నవారు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్స చేసిన కొద్దిసేపటికి చివరికి ప్రాణాలు విడిచాడు.