కాపాడే పోలీస్ స్టేషన్లోనే.. మహిళపై ఇంత దారుణమా?

praveen
మహిళలపై రోజురోజుకి దారుణాలు పెరిగిపోతున్నాయి. వరుసలు కూడా చూడకుండా కామాంధులు రెచ్చిపోతున్నారు. చిన్న పాప నుంచి వృద్ధిరాలి వరకు ఎవ్వరిని వదలడం లేదు. పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా నిత్యము ఎక్కడో ఒకచోట దారుణం చోటుచేసుకుంటుంది. అయితే కొన్ని కేసులు వెలుగులోకి వస్తుండగా మరికొన్ని ఘటనలు బయటకి రావడం లేదు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అత్యాచారాలు, సామూహిక అత్యాచారాలు, మహిళలపై దాడులు వంటివి వరుసగా వెలుగులోకి వస్తున్నాయి.  ఈ కాలంలో గ్యాంగ్ రేప్ ఘటనలు జరుగుతుండడంతో మహిళల్లో మరింత భయం పెరుగుతుంది. తాజాగా ఒక హోమ్ గార్డ్ పోలీస్ స్టేషన్ లోనే ఒక మహిళపై అత్యాచారయత్నం చేసిన ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది.

అనంతపురం జిల్లా కంబదూరు మండల కేంద్రంలోని పోలీస్‌ స్టేషన్‌లో కంబదూరు మండలానికి చెందిన దంపతులు తమ కూతురు ఈ నెల 22న అదృశమైందని ఫిర్యాదు చేసారు. అయితే ఆ అదృశ్యమైన వివాహిత తనంతట తానె పోలీస్ స్టేషన్ కు వచ్చింది. వెంటనే అక్కడ ఉన్న పోలీస్ వివాహిత తల్లితండ్రులకు ఫోన్ చేసి మీ అమ్మాయి పోలీస్ స్టేషన్ లో ఉందని సమాచారం అందించారు. తల్లితండ్రులు వచ్చే వరకు ఆ మహిళను స్టేషన్ లోనే ఉండిపోయింది. అయితే ఆ స్టేషన్ సిబ్బంది ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోయారు. ఇది గమనించిన ఒక హోమ్ గార్డ్ కన్ను ఆ మహిళపై పడింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న అతను ఆ మహిళను రిసెప్షన్‌ గదిలోకి తీసుకెళ్లాడు. పోలీస్ స్టేషన్ లో ఉన్నా, విదుల్లోనే ఉన్నా అని మర్చిపోయిన ఆ హోమ్ గార్డ్ మద్యం మత్తులో ఆ మహిళపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. వెంటనే బాధితురాలు గట్టిగా ఏడుస్తూ స్టేషన్ నుంచి బయటికి వచ్చేసింది. ఇది తెలిసి ఆ హోమ్ గార్డ్ ను వెంటనే సస్పెండ్ చేసినట్టు సమాచారం. అయితే పోలీస్ స్టేషన్ లోనే మహిళపై అత్యాచారయత్నం చేయడం ఇప్పుడు కలకలం రేపుతోంది. పోలీస్ స్టేషన్ లోనే మహిళలకు భద్రత లేకపోతే ఇంకెక్కడ ఉంటుందని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ హోమ్ గార్డ్ పై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: