సాఫ్ట్వేర్ ఉద్యోగం.. మంచి జీతం.. కానీ సడన్ హార్ట్ ఎటాక్?

praveen
మనిషి జీవితం ఇంతేనా అని అనిపించే ఘటనలు ఇటీవల కాలంలో చాలానే వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఒకసారి తల్లి కడుపు నుంచి బయటకు వచ్చిన తర్వాత వృద్ధాప్యం వస్తేనో లేదా దారుణమైన ఆరోగ్య సమస్య వస్తేనో అర్ధాంతరంగా ప్రాణాలు పోతాయ్ అని జనాలు అనుకునేవారు. కానీ ఇటీవల కాలంలో మాత్రం ఎప్పుడు ఎవరి ప్రాణం ఎలా పోతుందో కూడా ముందుగా చెప్పలేని విధంగా మారిపోయింది పరిస్థితి. ఎందుకంటే అంతా సంతోషంగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో కొంతమంది చూస్తూ చూస్తుండగానే కుప్పకూలిపోయి ప్రాణాలు వదులుతూ ఉన్నారు.


 మొన్నటికి మొన్న కరోనా వైరస్ ఎక్కడ ప్రాణాలు తీస్తుందో అని అందరూ భయపడ్డారు. అయితే ఇప్పుడు కరోనా వైరస్ ప్రభావం తగ్గిందని ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో సడన్ హార్ట్ ఎటాక్ లు మాత్రం ఏకంగా ప్రాణాలను తీసేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. సడన్ హార్ట్ ఎటాక్ లు ఎందుకు వస్తున్నాయో ఎలా వస్తున్నాయో ఎవరికీ అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆరోగ్యంగా ఉన్న చిన్నపిల్లల దగ్గర నుంచి అనారోగ్యం బారిన పడిన ముసలి వాళ్ళ వరకు ఎవరిని వదలకుండా సడన్ హార్ట్ ఎటాకులు క్షణాల వ్యవదిలో ప్రాణాలు తీసేస్తూ ఉన్నాయి. అప్పటివరకు నవ్వుతూ గడిపిన వారు కుప్పకూలిపోయి ప్రాణాలు వదులుతున్నారు.


 ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఈకోవలోకి చెందినదే అని చెప్పాలి. ఏకంగా సాఫ్ట్వేర్ ఉద్యోగి సడెన్ హార్ట్ ఎటాక్ తో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని తుకారం గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. గడ్డమీద బస్తీకి చెందిన సుర్జీత్ అనే 40 ఏళ్ల వ్యక్తి సాఫ్ట్వేర్ ఉద్యోగి . అయితే ఉదయం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది అని ఇంట్లో వాళ్ళతో చెప్పాడు  కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు  అప్పటికే అతను అపస్మారక స్థితిలోకి  వెళ్ళాడు  చివరికి పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు తెలిపారూ. అయితే తమ్ముడు సందీప్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: