ఓరి నాయనో.. షాంపూ ప్యాకెట్లను వదలని అక్రమార్కులు?
కొన్ని కొన్ని సార్లు సినిమాల్లో స్మగ్లింగ్ కి సంబంధించిన సన్నివేశాలు చూసినప్పుడు నిజజీవితంలో మాత్రం ఇంత క్రియేటివ్ గా అక్రమార్కులు ఆలోచించలేరు అని అనిపిస్తూ ఉంటుంది. ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత ఇక స్మగ్లర్ ఎంచుకున్న మార్గాలు చూసిన తర్వాత ఇలాంటివి సినిమాల్లో కూడా చూడలేదు బాబోయ్ అని ప్రతి ఒక్కరికి కూడా అనిపిస్తూ ఉంటుంది. మొన్నటి వరకు ఏకంగా వేసుకున్న దుస్తులు లేదంటే లో దుస్తుల్లో బంగారం డ్రగ్స్ దాచుకుని స్మగ్లింగ్ చేయడం చూశాం.
కానీ ఇప్పుడు వెలుగు లోకి వచ్చిన ఘటన గురించి తెలిస్తే మాత్రం మరింత షాక్ అవుతారు. ఎవరికి రానీ వినూత్నమైన ఆలోచన తో స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నించారు అక్రమార్కులు. ఈ క్రమం లోనే శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. ఏకంగా 42 లక్షల విలువయ్యే 704 బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు అని చెప్పాలి. బియ్యం, సర్ఫ్, షాంపూ, ప్యాకెట్లలో కువైట్ కు చెందిన ఒక ప్రయాణికుడు బంగారాన్ని తరలిస్తుండగా పట్టుకున్నారు. కాగా మరో ప్రయాణికుల నుంచి విదేశీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా మరో కేసులో 2.2 లక్షల విలువైన 15వేల సిగరెట్ల స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు.