స్మశానంలో ప్రేమ పెళ్లి.. ఇంతకీ అక్కడెందుకు చేశారంటే?
ఇక దీనికోసం గ్రాండ్ గా ఉండే ఒక ఫంక్షన్ హాల్.. బుక్ చేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కానీ ఇక్కడ మాత్రం అలా జరగలేదు. ఏకంగా పెళ్లి తంతు మొత్తం స్మశానంలో జరిగింది. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ లో ఈ విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. ఓ తండ్రి ప్రేమించిన యువకుడితో తన కుమార్తె పెళ్లిని స్మశానంలో ఘనంగా జరిపించాడు. ఎక్కడ ఏం తక్కువ కాకుండా సాంప్రదాయబద్ధంగా స్మశానంలో వివాహ తంతు పూర్తి చేశాడు. అయితే ఇలా స్మశానంలో పెళ్లి జరగడం గురించి చుట్టుపక్కల అందరూ చర్చించుకుంటున్నారు అని చెప్పాలి.
షిరిడి సమీపంలోని రహతా గ్రామానికి చెందిన గంగాధర్ స్థానిక స్మశాన వాటికలో కాటికాపరిగా పనిచేస్తూ ఉండేవాడు. అయితే మహా సంజోగి వర్గానికి చెందిన ఆయన చాలా ఏళ్లుగా కుటుంబంతో కలిసి ఇక స్మశానవాటికలోనే నివాసం ఉంటున్నాడు. కాగా గంగాధర్ కు మయూరి అనే కుమార్తె ఉంది.12వ తరగతి వరకు చదివింది. కాగా ఆమె మనోజ్ అనే యువకుని ప్రేమించింది. కాగా ఈ పెళ్లికి ఇరువురి కుటుంబాలు అంగీకరించగా.. మయూరి పెరిగిన చోటే ఆమె పెళ్లి చేయాలనుకున్న గంగాధర్ బంధువులు సన్నిహితుల సాక్షిగా అటు స్మశానవాటికలోనే ఘనంగా పెళ్లి తంతు పూర్తి చేసాడు.