దహనం చేస్తుండగా.. వరదల్లో కొట్టుకుపోయిన మృతదేహం?
చూస్తూ చూస్తూ ఉండగానే ఏకంగా మృతదేహం వరద నీటిలో కొట్టుకుపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ఇన్స్టాగ్రామ్ లో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఈ ఘటన ఉత్తరఖండ్‌లో వెలుగులోకి వచ్చింది. ఇటీవల కాలంలో భారీ వర్షాలు నేపథ్యంలో ప్రతి రాష్ట్రంలో కూడా వరదలు ముంచెత్తుతూ ఉన్నాయి. ఈ వరదలు నేపథ్యంలో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ ఏకంగా కనీసం అంత్యక్రియలు కూడా వరదలు కారణంగా సవ్యంగా నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి.
ఓ వ్యక్తి చనిపోవడంతో బంధువులు వచ్చి స్మశాన వాటికలో మృతదేహాన్ని దహనం చేశారు. అయితే పూజల అనంతరం దహనం ప్రక్రియ ప్రారంభించారు. అయితే కాలిపోతున్న మృతదేహం దగ్గర కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. అందరూ ఒడ్డును చూస్తూ నిలబడ్డారు అయితే ఆకస్మాత్తుగా ఒక బలమైన వరద నీటి ప్రవాహం దూసుకు వచ్చింది. అయితే ఈ ప్రవాహాన్ని చూసి భయపడిపోయిన అందరూ కూడా కాస్త దూరం వెళ్లి నిలబడ్డారు. అయితే ఈ వరద ప్రవాహానికి కాలిపోతున్న మృతదేహం నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఇక చివరికి ఆ మృతదేహం ఎక్కడికి వెళ్లిందో ఎవరికీ తెలియదు. ఈ వీడియో చూసి నేటిజన్స్ సైతం షాక్ అవుతున్నారు.