చెల్లి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉందని.. అన్న ఏం చేశాడో తెలుసా?
ఎందుకంటే ఏకంగా రక్తం పంచుకొని పుట్టిన వారి విషయంలో కూడా కర్కశంగా ప్రవర్తిస్తూ చివరికి ప్రాణాలు తీసేందుకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక చిన్న చిన్న కారణాలకే ఇలా విచక్షణ కోల్పోతూ ఎన్నో ప్రాణాలను గాల్లో కల్పిస్తున్నారు. ఇలాంటి ఘటనలు చూసిన తర్వాత ఇంత చిన్న కారణానికి కూడా ప్రాణాలు తీస్తారా అని ప్రతి ఒక్కరు ముక్కున వేలేసుకుంటున్నారు అని చెప్పాలి. ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇలాంటి ఘటన వెలుగు చూసింది. చెల్లెలు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ వీడియోలు పెడుతుంది అని ఆగ్రహించిన సోదరుడు.. చివరికి ఆమెను రోకలిబండతో కొట్టి చంపేశాడు.
ఇల్లందు మండలం రాజీవ్ నగర్ లో ఈ ఘటన జరిగింది. అయితే ఇలా రోకలి బండతో కొట్టి చెల్లిని చంపేసిన సదరు వ్యక్తి రాయి పగిలి చనిపోయింది అని నమ్మించేందుకు కొత్త నాటకానికి తెరలేపాడు. కానీ గ్రామస్తులు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని అసలు విషయం ఏంటో తేల్చారు. అజ్మీర సింధు అనే యువతకి తల్లి, సోదరుడు హరిలాల్ ఉన్నారు. అయితే మహబూబాబాద్ లో అప్రెంటిస్ చేస్తున్న సింధు సోషల్ మీడియాలో చురుకుగా ఉండేది. అయితే ఇది నచ్చక హరిలాల్ ఆమె తరచు గొడవపడేవాడు. ఇదే విషయంపై ఇటీవల మరోసారి గొడవలు జరగగా.. హరిలాల్ విచక్షణ కోల్పోయి రోకలిబండ తీసుకొని ఆమె తలపై కొట్టడంతో తీవ్రంగా గాయపడింది. ఆసుపత్రికి తరలించగా చికిత్స తీసుకుంటూ ప్రాణాలు కోల్పోయింది. అయితే సంఘటన స్థలానికి పోలీసులు చేరుకునే లోపే హరిలాల్ పరారయ్యాడు. కాగా అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.