భలే దొంగలు.. అచ్చం సినిమా టైపులో?
ఆ మధ్య వచ్చిన తమిళ్ డబ్బింగ్ సినిమాలో హిరో, సహ నటుడు కలిపి ప్లిప్ క్లార్ట్ అమెజాన్, లాంటి ఆన్ లైన్ సంస్థల నుంచి ఆర్డర్ లు పెట్టించుకుని ల్యాప్ ట్యాప్, ఫోన్లు తీసుకోవడం అందులోని రా మెటిరియల్ తీసుకుని వాటిని తిరిగి రిటర్న్ పెట్టేయడం లాంటివి చేస్తారు. వీరికి తోడు హిరోయిన్, సహ నటి కూడా ఇలాంటి దొంగతనాల్లో ఆరి తేరిన వారు ఉంటారు. ఇలా సరికొత్త రకాల దొంగతనాలు చేస్తూ పోలీసులకే సవాల్ విసురుతారు.
ప్రస్తుతం ఇలాంటిదే ఆంధ్రప్రదేశ్ లో వెలుగులోకి వచ్చింది. విశాఖ పట్నం జిల్లా సబ్బవరంలో ఏసీ టెక్నిషియన్లు ముగ్గురు రాత్రిల్లు దొంగతనం చేయడం నేర్చుకున్నారు. రావిపాలెం రమణయ్య పేటకు చెందిన సతీశ్ చంద్ర, నాగ శివకుమార్, శ్రీనివాస నగర్ కు చెందిన బుడగ ఆనంద్ కుమార్ లను సబ్బవరం పోలీసులు అరెస్టు చేశారు. ఆయా ఇళ్లలోని గృహోపకరణాలైన ఏసీలు, ప్రిడ్జిలు, టీవీలను దొంగతనం చేసి వాటిని ఓలెక్స్ లో పెట్టి సెకండ్ అని అమ్మేయడం చేస్తున్నారు.
అంటే ఈ ముగ్గురు దొంగలు పగలంతా ఏదో ఒక చోట పని చేయడం అక్కడ వారికి అవసరమైన ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించడం, అనంతరం వాటిని ఓలెక్స్ లో పెట్టి అమ్మేయడం ఇలా చేస్తున్న వీరు పోలీసులకు పట్టుబడ్డారు. ఈ తరహ దొంగతనాలు వీరు కచ్చితంగా సినిమాలో చూసి చేసినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే తమిళ డబ్బింగ్ సినిమా తరహాలో ఈ దొంగతనాలు జరగడంతో అందరూ వీళ్లు ఈ సినిమా చూసి ఇన్ స్పైర్ అయినట్లు తెలుస్తోంది.