వైరల్: ఫ్లోర్ లోపల సౌండ్స్.. పగలగొడితే ఏం బయట పడిందంటే?
నీటిలో ఉండాల్సిన జీవులు భూమిలో.. పైగా మీ ఇంటి ఫ్లోర్ లోపల జీవిస్తే ఎలావుంటుంది? ఆ ఆలోచనే చాలా భయానకంగా ఉంటుంది కదా! ఇక్కడ అదే సంఘటన జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. విషయం ఏమిటంటే, ఓ ప్రాంతంలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. సిమెంట్ నేల అడుగు నుంచి శబ్ధాలు వస్తుండడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. వెంటనే రెస్క్యూ సిబ్బందికి ఫోన్ చేయగా అక్కడికి చేరుకున్న సిబ్బంది నేలపై ఉన్న సిమెంట్‌ను తొలగించారు.
కట్ చేస్తే ఆశ్చర్యకరంగా ఆ గచ్చు అడుగు భాగం నుంచి ఓ పెద్ద మొసలి బయటికి వచ్చింది. దీన్ని చూడగానే అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. నేల అడుగు నుంచి మొసలి రావడం ఏంటీ అని స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అంతలో ఊహించని విధంగా దాని కింద నుంచి మరో మొసలి బయటికి వచ్చింది. వచ్చీ రాగానే అక్కడున్న వారిపై దాడి చేయాలని చూసింది. భయంతో అక్కడున్న వారంతా పరుగులు పెట్టారు. అయితే వెంటనే అప్రమత్తం అయిన అక్కడి సిబ్బంది వాటిని చాలా జాగ్రత్తగా పట్టుకున్నారు. ఈ ఘటనను అక్కడ ఉన్న వారిలో ఒకరు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేయంగా అది కాస్త వైరల్ అవుతోంది. ఆ దృశ్యాన్ని చూసిన నెటిజన్లు సైతం అవాక్కవుతున్న పరిస్థితి.