వాట్సాప్ లో హార్ట్ ఎమోజి పంపిస్తే.. రెండేళ్ల జైలు శిక్ష?

praveen
ఇటీవల కాలంలో టెక్నాలజీ ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే టెక్నాలజీకి అనుగుణంగా మనిషి జీవనశైలిలో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి. ఒకప్పుడు కాస్త ఖాళీ సమయం దొరికింది అంటే చాలు ఇక దగ్గర్లో ఉన్న స్నేహితులను కలిసి వారితో సరదాగా గడపాలని భావిస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు కాస్త ఖాళీ సమయం దొరికింది అంటే ఆ సమయాన్ని మొత్తం సోషల్ మీడియా మీద పెట్టేస్తూ ఉన్నారు. ఇక ఇలా సోషల్ మీడియా కారణంగా ప్రతి ఒక్కరికి స్నేహితులు కూడా కాస్త ఎక్కువగానే కనిపిస్తున్నారు.


 చాటింగులు మీటింగులు అన్నీ కూడా సోషల్ మీడియా లోనే జరిగిపోతున్నాయని చెప్పాలి. ఇలాంటి సమయంలో అటు ఎంతో మంది నెటిజన్స్ తమ హవ భావాలను ఇతరులను వ్యక్తపరిచేందుకు ఇక ఎన్నో రకాల ఎన్నో ఎమోజీలు  కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలోనే మనసులో ఉన్న ప్రేమను వ్యక్తపరిచేందుకు లవ్ సింబల్ ఎమోజి కూడా వాట్సాప్ లో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ ఎమోజీలను ఎంతో మంది యూసర్లు తెగ వినియోగిస్తూ ఉంటారు  కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే విషయం తెలిస్తే మాత్రం ఏమోజీలు పంపడం విషయంలో కూడా ఇప్పటినుంచి కాస్త జాగ్రత్తలు తీసుకుంటారు అని చెప్పాలి.


 మరి ముఖ్యంగా మహిళలకు హార్ట్ సింబల్ పంపిస్తే చివరికి జైలు శిక్ష పడుతుంది అంటే ఎవరైనా నమ్ముతారా.. ఊరుకొండి బాసు.. హార్ట్ సింబల్ పంపితే జైలు శిక్ష పడటం ఏంటి అని షాక్ అవుతారు ప్రతి ఒక్కరు. కానీ కువైట్ సౌదీ అధికారులు మహిళలకు హార్ట్ ఎమోజిని పంపడాన్ని నేరంగా పరిగణిస్తున్నట్లు వెల్లడించారు  ఇకపై మహిళలకు హార్ట్ సింబల్ పంపిస్తే రెండేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది అని హెచ్చరించారు. దీంతో అక్కడి అధికారులు తెచ్చిన నిబంధన పై ఇండియాలో కూడా తెగ చర్చించుకుంటున్నారు అని చెప్పాలి. మన దేశంలో కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుంటే ఎలా అని ఆందోళనలో మునిగిపోతున్నారు సోషల్ మీడియా ప్రియులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: