'గే' అంటూ సీనియర్లు ర్యాగింగ్.. అతను చేసిన పనికి అందరూ షాక్?

praveen
సాధారణంగా ప్రతి వ్యక్తి జీవితంలో స్కూల్ కాలేజీ డేస్ స్వీట్ మెమోరీస్ గా మిగిలిపోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఉద్యోగం చేస్తున్న సమయంలో ఇలా కాలేజీ డేస్ ను గుర్తు చేసుకుంటూ ఎంతో మంది తెగ సంతోష పడిపోతూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు కాలేజీ ఫ్రెండ్స్ అందరూ కలిసి రీ యూనియన్ నిర్వహిస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో ఇక మళ్ళీ పాత ఫ్రెండ్స్ ని కలిసి మరికొన్ని స్వీట్ మెమోరీస్ ని ఏర్పరచుకుంటూ ఉంటారు అని చెప్పాలి. అయితే కాలేజీ డేస్ లో ఉండే స్వీట్ మెమోరీస్ లలో అటు ర్యాగింగ్ కూడా ఒకటి. కొత్తగా కాలేజీకి వెళ్లిన సమయంలో సీనియర్లు ర్యాగింగ్ చేయడం చేస్తూ ఉంటారు.


 అయితే ఇలాంటి ర్యాగింగ్లు అటు విద్యార్థి దశలో ఉన్నప్పుడు కాస్త ఇబ్బందిగా అనిపించినప్పటికీ.. ఇక కాలేజీ పూర్తయి జాబ్ చేసేటప్పుడు మాత్రం జీవితాంతం గుర్తుపోండి పోయే స్వీట్ మెమరీస్ గా మిగిలిపోతూ ఉంటాయ్. అయితే ర్యాగింగ్ ఒక హద్దులో ఉంటే బానే ఉంటుంది. కానీ మితిమీరిన ర్యాగింగ్ ఇటీవల కాలంలో కాలేజీలలో కనిపిస్తోంది. వెరసి ఇక ఇలాంటి మితిమీరిన ర్యాగింగ్ కారణంగా చివరికి ఎంతోమంది మనస్థాపంతో ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి ర్యాగింగ్ కారణంగానే ఒక విద్యార్థి చివరికి మనస్థాపంతో ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.


 బెంగాల్లోని జోదోపూర్ వర్సిటీలో ఈ ఘటన జరిగింది. బిఏ విద్యార్థి స్వప్నదీప్ ఇటీవల బిల్డింగ్ పైనుంచి దూకి సూసైడ్ చేసుకున్నాడు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు కీలక విషయాలను కనుగొన్నారు  స్వప్న దీప్ ను సీనియర్లు గే అంటూ ర్యాగింగ్ చేస్తూ కాలేజీ మొత్తం ప్రచారం చేయడం మొదలుపెట్టారూ. అంతేకాదు దుస్తులు విప్పి మరో విద్యార్థి గదిలోకి  వెళ్లాలని ఒత్తిడి చేశారు. ఇక ఈ ప్రచారంతో అందరూ అతని హేళన చేయడం మొదలుపెట్టారు. దీంతో అవమానంగా ఫీల్ అయిన స్వప్న దీప్ నేను గే కాదు అంటూ గట్టిగా అరుస్తూ బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసులో నిందితుడు సౌరబ్ ను అరెస్టు చేశారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: