వింత ఘటన.. ఆ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకుంటున్న పక్షులు?
కానీ మనుషుల్లాగా పక్షులు కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోతాయి అని ఎప్పుడైనా విన్నారా.. అలా ఎందుకు చనిపోతాయి. చనిపోవాలి అని వాటికి ఎందుకు ఆలోచన వస్తుంది అని అంటారు ఎవరైనా. కానీ ఇక్కడ మాత్రం ఇలాంటి వింతే జరుగుతుంది. అది ఎక్కడో కాదు అస్సాం రాష్ట్రంలో. జాతింగా విలేజ్ లో. రాత్రి అయితే గ్రామంలోకి ప్రవేశం నిషేధం. ఇతర గ్రామాలతో 9 నెలలుగా ఈ గ్రామానికి సంబంధాలు కూడా తెగిపోయాయి. దీనికి వెనుక ఒక పెద్ద కారణమే ఉంది. ఎందుకంటే రాత్రి 7 గంటల నుంచి 10 గంటల ప్రాంతంలో పక్షులు ఆత్మహత్యకు పాల్పడుతూ ఉంటాయి. ఇళ్లను, చెట్లను ఢీకొని చనిపోతున్నాయి.
సాధారణంగా అయితే ఆగస్టు నుంచి నవంబర్ వరకు ఇక్కడ కొత్త పక్షులు సందడి చేస్తాయ్. అలాగే ఆత్మహత్య చేసుకుని చనిపోతాయ్. అందుకు కారణాలు ఏంటి అనేది ఇప్పటివరకు ఎవరు కనుగొను లేకపోయారు. ఇక అక్కడ ప్రజలకు కూడా ఇది అర్థం కాక ఆందోళనలో మునిగిపోతున్నారు. అయితే ఇక్కడ అయస్కాంత శక్తి ఎక్కువని పరిశోధకులు చెబుతున్నారు. గ్రామస్తులు మాత్రం ఎన్నో కథలను తెరమీదకి తెచ్చారు. గ్రామంలో ఏదో దృష్టి శక్తి ఉందని దానివల్లే పక్షులు ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నాయని నమ్ముతున్నారు.