మజాతో ఆమ్లెట్ తయారీ.. వామ్మో ఇదెక్కడి ప్రయోగంరా బాబు?

praveen
ఇటీవల కాలంలో జనాలు స్ట్రీట్ ఫుడ్స్ కి ఎంతలా అలవాటు పడిపోయారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఎక్కడికి వెళ్లినా ఏ టైంలో అయినా స్ట్రీట్ ఫుడ్ అందుబాటులో ఉన్న నేపథ్యంలో ఇక ఎక్కడో మంచి రెస్టారెంట్ కు వెళ్లడం ఎందుకు.. మన దగ్గర ఉన్న స్ట్రీట్ ఫుడ్ తింటే సరిపోతుంది కదా అని అందరూ అనుకుంటున్నారు అని చెప్పాలి. అయితే అటు స్ట్రీట్ ఫుడ్ లవర్స్ ను ఆకట్టుకోవడం కోసం ఇక ఎంతోమంది వ్యాపారులు కూడా చిత్ర విచిత్రమైన ప్రయోగాలుచేస్తూ ఉంటారు.


 ఇక ఇలాంటి తరహా వీడియో లు కూడా సోషల్ మీడియాలో చాలానే వైరల్ గా మారిపోతూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక ఇలా కొత్తగా ట్రై చేసిన వంటకాలలో కొన్ని ఫుడ్ లవర్స్ మెప్పిస్తే.. ఇంకొన్ని వంటకాలు మాత్రం ప్రతి ఒక్కరికి చిరాకు తెప్పిస్తాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయిన ఇలాంటి కొత్త వంటకం కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. సాధారణంగా  ఆమ్లెట్ అంటే ఇష్టపడని వారు ఉండరు. ఎంతో మంది సమయం దొరికినంటే ఆమ్లెట్ వేసుకొని తినడానికి ఇష్టపడుతుంటారు. ఆమ్లెట్ కి ఎలా చేస్తారు అన్న విషయంపై కూడా అందరికీ ఒక క్లారిటీ ఉండే ఉంటుంది. కానీ ఇక్కడ ఒక వ్యక్తి ఆమ్లెట్ తయారు చేసిన విధానం చూస్తే అందరూ షాక్ అవుతారు.


 సాధారణంగా ఆయిల్ వేసి ఆమ్లెట్ వేయడం అందరికీ తెలుసు. కానీ ఇక్కడ ఏకంగా కూల్ డ్రింక్ లలో ఒకటైన మజా వేసి ఆమ్లెట్ తయారు చేశాడు. ముందు నూనె పోసి ఆమ్లెట్ చేశాడు. తర్వాత మజా వేస్తూ ప్రయోగం చేసాడు. ఆమ్లెట్ రెడీ అయ్యాక మజా వేసి పచ్చ గుడ్డు వేసి బాగా మెడిసి.. పైన చీజ్ను రకరకాల మసాలాలను వేశాడు. మళ్లీ ఉడికించిన తెల్ల గుడ్డు ముక్కలను వేస్తాడు. మిశ్రమాన్ని తీసుకెళ్లి ఆమ్లెట్ పై వేసి పన్నీరు తురుముతూ కొత్తిమీర చల్లి చివరికి కస్టమర్కు అందిస్తాడు. ఇక ఈ వీడియో చూసి ఇదేం పంటకం రా బాబు అని ఎంతో మంది నేటిజన్స్ షాక్ అవుతున్నారు.Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: