పడగ విప్పి బుస కొట్టిన పాము.. చంపేద్దామని గన్ తో కాల్చిన వ్యక్తి.. కానీ చివరికి?

praveen
విష సర్పాలను చూస్తే ఎవరైనా సరే భయంతో వనికి పోతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వాటి జోలికి వెళ్లడానికి తెగ భయపడిపోతూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం ఏకంగా విష సర్పాలతో పిచ్చి పనులు చేస్తూ ఉంటారు. ఏకంగా విషపూరితమైన పాములకు ముద్దు పెట్టడం.. లేదా వాటితో ఆడుకోవడం చేస్తూ ఉంటారు. ఇలాంటివి చేసి కొన్ని కొన్ని సార్లు పాముకాటు బారినపడి ప్రాణాలు మీదికి తెచ్చుకుంటూ ఉంటారు. ఇంకొందరు ఏకంగా విషసర్పం కళ్ళ ముందు కనిపించింది అంటే చాలు దానిని ఎలాగైనా చంపేయాలి అని నిర్ణయించుకుంటూ ఉంటారు అని చెప్పాలి.


 ఇంకొంతమంది మధ్యమధ్యలో ఏకంగా పామును నోట్లో పెట్టుకుని నమిలేయడం లాంటివి చేసి ప్రాణాలు పోగొట్టుకుంటున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తూ ఉంటాయ్. ఇప్పుడు జరిగిన ఘటన అయితే మరింత విచిత్రమైనది. సాధారణంగా ఒక పామును చంపాలి అని నిర్ణయించుకున్నప్పుడు ఎవరైనా సరే ఒక భారీ కర్ర తీసుకొని పామును చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం కాస్త బిల్డప్ లకి పోయాడు. ఏకంగా పడగ విప్పి బుస కొడుతున్న పామును గన్ తో కాల్చాలి అనుకున్నాడు.


 ఈ క్రమంలోనే తన చేతిలో తుపాకీ పట్టుకొని పాముకు గురిపెట్టి కాల్చాడు. కానీ ఆ తర్వాత ఊహించని ఘటన జరిగింది. రాజస్థాన్ బుండి జిల్లా బోజసార్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ప్రసాద్ అనే వ్యక్తికి ఇటీవల ఇంట్లో ఉన్న సమయంలో బయట నుంచి కేకలు వినిపించాయి. దీంతో ఉలిక్కి పడ్డ ప్రసాద్ పరిగెత్తుకుంటూ బయటికి వచ్చాడు. అక్కడ ఎదురుగా ఒక నాగుపాము పడగ విప్పి పూసలు పడుతూ కనిపించింది. అయితే దాన్ని చంపాలంటూ ఇంట్లో వాళ్ళు కోరడంతో వేగంగా ఇంట్లోకి వెళ్లి పాత డబుల్ బ్యారెల్ గన్ తీసుకొచ్చాడు. తుపాకీతో బుల్లెట్ చూపించి పాము వైపు గురిపెట్టి టార్గెట్ చేసి ట్రిగ్గర్ నొక్కాడు. కానీ బుల్లెట్ పామును తాకాల్సింది పోయి తుపాకి పై భాగంలో పెద్ద శబ్దం వచ్చి అక్కడే పేలింది. దీంతో ప్రసాద్కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆ శబ్దానికి పాము అక్కడి నుంచి ఇంట్లోకి దూరింది. తీవ్రంగా గాయపడ్డ ప్రసాద్ ను  స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ ఘటన తర్వాత ఆ నాగుపాము నాగదేవత అని స్థానికులు కొందరు అనుకోవడం మొదలుపెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: